Chandrababu- KCR: కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. మళ్లీ ప్రజా క్షేత్రంలోకి రావాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ

టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. సోమవారం (డిసెంబర్‌ 11) సోమాజీ గూడ యశోదా ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Chandrababu- KCR: కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. మళ్లీ ప్రజా క్షేత్రంలోకి రావాలి.. బీఆర్ఎస్ అధినేతకు చంద్రబాబు పరామర్శ
Chandrababu Naidu. Kcr
Follow us

|

Updated on: Dec 11, 2023 | 5:53 PM

టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. సోమవారం (డిసెంబర్‌ 11) సోమాజీ గూడ యశోదా ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ప్రజా జీవితంలోకి రావాలని, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు వెంట పలువురు టీడీపీ నాయకులు, నేతలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈనెల 7 అర్ధరాత్రి బాత్రూమ్‌లో జారిపడ్డారు. తుంటి ఎముకకు గాయం కావడంతో సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. మెరుగైన వైద్యం అందించాలని.. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులను కేసీఆర్‌ను పరామర్శించారు.

తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేసీఆర్ ను పరామర్శించారు. అలాగే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి, చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇక ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు తదితరులు కేసీఆర్‌ను పరామర్శించారు.

ఆస్పత్రిలో కేసీఆర్ తో మాట్లాడుతోన్న చంద్రబాబు.. వీడియో

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..