Telangana: ముందు పానీయం ఇస్తాడు.. ఆ తర్వాతే అసలు కథ.. తాంత్రిక పూజల పేరుతో 15కి పైగా హత్యలు..!
మూడేళ్ల క్రితం వనపర్తి జిల్లాలో నలుగురు కుటుంబ సభ్యుల హత్య మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్లే తాంత్రిక పూజలకే నలుగురు బలయ్యారు. పూజల పేరుతో అమాయకులను బలి తీసుకున్న నరహంతకుడుని ఎట్టకేలకు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ లో నలుగురు కుటుంబ సభ్యులు విగత జీవులుగా మృత్యువాత ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది.

మూడేళ్ల క్రితం వనపర్తి జిల్లాలో నలుగురు కుటుంబ సభ్యుల హత్య మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్లే తాంత్రిక పూజలకే నలుగురు బలయ్యారు. పూజల పేరుతో అమాయకులను బలి తీసుకున్న నరహంతకుడుని ఎట్టకేలకు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ లో నలుగురు కుటుంబ సభ్యులు విగత జీవులుగా మృత్యువాత ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ఇంట్లో మొత్తం తాంత్రిక పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు లభించాయి. మరణించిన నలుగురు ఎక్కడికక్కడ ప్రాణాలు వదిలారు. అసలు శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు, హత్యకు గానీ ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ నలుగురి మర్డర్ కేసు పోలీసులకు పెద్ద సవాల్ గా నిలించింది. మూడేళ్లుగా కేసులో దర్యాప్తు సాగుతోంది. మొదట కుటుంబసభ్యులే హత్యలకు కారణమా..? అని భావించారు. అదే కోణంలో దర్యాప్తు సాగించారు. కానీ కుటుంబ సభ్యుల ఎవరు నిందితులు కాదని తేల్చుకున్నారు. చివరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన తాంత్రిక పూజారి సత్యం యాదవ్ ఈ సీరియల్ హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
తీగ లాగితే కదిలిన డొంక..
హైదరాబాద్ లో ఓ మిస్సింగ్ కేసులో దర్యాప్తు కాస్త ఈ సీరియల్ మర్డర్ మిస్టరీ బయటపడినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆచూకీ లభించకపోవడంతో కాల్ డేటా తీయగా అనుమానిత నెంబర్ టార్గెట్ గా దర్యాప్తు సాగింది. తీరా అసలు సైకో కిల్లర్ చిక్కాడు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సత్యం యాదవ్ తాంత్రిక పూజల హిస్టరీ బయటపడింది.
పోలీసుల అదుపులో నిందితుడు?
ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పూర్తి వాస్తవాలను బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసు దర్యాప్తు, నిందితుడి అదుపులోకి తీసుకున్న అంశాలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ధృవీకరించలేదు.
15కి పైగా హత్యలకు అతడే కారణమా?
నిందితుడు గుప్త నిధుల పేరుతో మూడు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో వనపర్తి జిల్లాలో, కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని అనంతపురంలోనూ ఇదే తరహా ఘటనల్లో సత్యం యాదవ్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 15మందికి పైగా హత్యలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
అమాయకులే టార్గెట్ గా తాంత్రిక పూజలు, హత్యలు..
తాంత్రిక పూజలు చేస్తున్నాడని మొదటి నుంచి సత్యం యాదవ్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ జాతీయ పార్టీ నుంచి కౌన్సిలర్ గా పోటి చేశాడు. విషయం తెలుసుకున్న సదరు పార్టీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే తన ప్రవృత్తిని మాత్రం వీడలేదు. అమాయకులను గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేస్తే అపార సంపద మీ సొంతం అవుతుందని నమ్మిస్తాడు. ఆ తర్వాత పూజలు చేసినందుకు తనకు భారీగా డబ్బు లేదా భూములు ఇవ్వాలని కోరతాడు. సంపదకు ఆశపడ్డ బాధితులు కోరినట్లుగా సత్యం యాదవ్ కు మూట చెప్పేవారు. అనంతరం నెలల తరబడి బాధితులకు చిక్కకుండా తిరిగేవాడు. ఎవరైతే తీవ్ర ఒత్తిడి తెస్తారో వాళ్లను అదే తాంత్రిక పూజల పేరుతో హత్యకు పాల్పడతాడని తెలుస్తోంది. తీర్థం రూపంలో పానీయం ఇచ్చి మిస్టరీగా హత మార్చుతాడు. ఇంత జరిగిన ఎక్కడ కూడా ఆధారాలు వదలడు ఈ మాయలమారీ.
మొదటి నుంచి సత్యమే నిందితుడు అని చెబుతున్నామని బాధితుల కుటుంబ సభ్యుడు కరీం పాషా తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేయాలని తమ కుటుంబ సభ్యులను నమ్మించాడని చెప్పాడు. పూజలు చేసినందుకు ప్లాట్ కూడా రాయించుకున్నాడని కరీం తెలిపాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
