AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026లో మహా ‘ముదుర్లు’.. కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే

IPL 2026 : ఐపీఎల్ 2026లో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్న సీనియర్ దిగ్గజాలు రంగంలోకి దిగుతున్నారు. 44 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ నుంచి జోస్ బట్లర్ వరకు అనుభవం, ఫిట్‌నెస్, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యంతో కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తున్న టాప్-5 వెటరన్ క్రికెటర్లపై స్పెషల్ స్టోరీ.

IPL 2026 : ఐపీఎల్ 2026లో మహా ‘ముదుర్లు’..  కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
Ipl 2026 Top 5 Oldest Icons
Rakesh
|

Updated on: Mar 21, 2026 | 10:06 AM

Share

IPL 2026 : ఐపీఎల్ (IPL) అంటేనే యువ రక్తం ఉరకలేసే వేదిక. ఒక్క సీజన్ మెరిస్తే చాలు.. రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, ఏకంగా టీమిండియా తలుపులు తట్టవచ్చు. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేవలం కుర్రాళ్లే కాదు, వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తున్న ఐదుగురు సీనియర్ దిగ్గజాలు ఈసారి మైదానంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. ఆటలో అనుభవం, ఫిట్‌నెస్‌లో యువతకు సవాల్ విసురుతున్న ఆ ‘ముదుర్ల’ ముచ్చట తెలుసుకుందాం.

1. మహేంద్ర సింగ్ ధోనీ(44 ఏళ్లు 255 రోజులు)

ఐపీఎల్ 2026లో బరిలోకి దిగుతున్న ఆటగాళ్లలో అందరికంటే పెద్ద వయస్కుడు మన థలా ఎంఎస్ ధోనీ. 45 ఏళ్లకు చేరువలో ఉన్నా, స్టంప్స్ వెనుక అతని మెరుపు వేగం ఇప్పటికీ కుర్రాళ్లకు అందనంత ఎత్తులో ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే ధోనీ.. ధోనీ అంటే సీఎస్‌కే అన్నంతగా ముద్ర పడిపోయింది. ఇప్పటికీ ధోనీకి సరైన వారసుడిని వెతకడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోందంటే, అతని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లోనూ వికెట్ల వెనుక నుంచి మ్యాచులను తిప్పేసేందుకు మాహి సిద్ధమైపోయాడు.

2. రోహిత్ శర్మ (38 ఏళ్లు 323 రోజులు)

ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ. ఐదు ట్రోఫీలను అందించిన ఘనత అతనిది. ప్రస్తుతం ముంబై పగ్గాలు హార్దిక్ పాండ్యా చేతిలో ఉన్నప్పటికీ, జట్టుకు వెన్నెముక మాత్రం రోహితే. దాదాపు 39 ఏళ్లకు చేరువలో ఉన్నా, హిట్ మ్యాన్ సిక్సర్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ సీజన్‌లో కెప్టెన్సీ భారం లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించేందుకు రోహిత్ రెడీగా ఉన్నాడు.

3. అజింక్య రహానే (37 ఏళ్లు 284 రోజులు)

అనుభవానికి మారుపేరుగా నిలిచే అజింక్య రహానే, ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును ముందుండి నడిపించబోతున్నాడు. దాదాపు 38 ఏళ్ల వయసులో జట్టు పగ్గాలు చేపట్టడం విశేషం. శాంత స్వభావం, పక్కా టెక్నిక్‌తో బ్యాటింగ్ చేసే రహానే.. టీ20ల్లోనూ తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూ కేకేఆర్‌కు మరో ట్రోఫీ అందించడమే లక్ష్యంగా రహానే బరిలోకి దిగుతున్నాడు.

4. విరాట్ కోహ్లీ (37 ఏళ్లు 134 రోజులు)

ఐపీఎల్ 2025లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టి తన కల నెరవేర్చుకున్న విరాట్ కోహ్లీ, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. 37 ఏళ్లు దాటినా, ఫిట్‌నెస్‌లో అతనికి సాటి ఎవరూ లేరు. ఇప్పటికీ మైదానంలో కుర్రాళ్ల కంటే వేగంగా పరుగెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈ సీజన్‌లోనూ తనదైన శైలిలో పరుగుల వేట కొనసాగించి ఆర్సీబీకి మరో టైటిల్ అందించాలని కింగ్ కోహ్లీ భావిస్తున్నాడు.

5. జోస్ బట్లర్ (35 ఏళ్లు 192 రోజులు)

ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న బట్లర్.. వయసుతో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. 35 ఏళ్ల వయసులోనూ అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఏమాత్రం తగ్గలేదు. అద్భుతమైన వికెట్ కీపింగ్, నాయకత్వ లక్షణాలు ఉన్న బట్లర్.. గుజరాత్ జట్టుకు ఈసారి పెద్ద ఎసెట్ కాబోతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us