AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. ఏళ్ళ నుంచి వేధిస్తున్న కీళ్ల నొప్పులు చిటికెలో మాయమవుతాయ్

శరీరంలో కీళ్ల వాపులు, మెడ నొప్పి, నడుము నొప్పి, జాయింట్ పెయిన్, ఎముకల్లో గుజ్జు అరిగిపోవడం, నరాల బలహీనత, చేతివేళ్లు వాచిపోవడం, పాదాలు వాపు రావడం వంటివి చాలా మందికి సాధారణ సమస్యలు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Prasanna Yadla
|

Updated on: Oct 14, 2026 | 3:47 PM

Share

శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందకపోవడం, మధుమేహం, అధిక మందుల వాడకం, గాయాలు, మెదడు,  వెన్నెముక సమస్యలు నరాల నొప్పికి దారితీస్తాయి. ముఖ్యంగా,  విటమిన్ బి12 లోపం కండరాల నొప్పులు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, బరువు తగ్గడం, వికారం వంటి లక్షణాలకు కారణమవుతుంది. చేపలు, గుడ్లు, మాంసం, చీజ్, పెరుగు, పాలు వంటి బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్యలను అధిగమించవచ్చు.

1 / 5
అంతేకాకుండా, ఎక్కువసేపు కూర్చోవడం, వేళకాని వేళల్లో భోజనం చేయడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి జీవనశైలి అలవాట్లు కూడా ఎముకలు, కీళ్ల నొప్పులకు దారితీస్తాయి. మధ్యమధ్యలో నడవడం, మంచి నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి పాటించడం అవసరం.

2 / 5
కీళ్ల, కండరాల నొప్పుల ఉపశమనానికి నువ్వుల నూనె, కర్పూరం మిశ్రమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నువ్వుల నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ఇ, కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, బలానికి తోడ్పడతాయి. నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇది నరాల సమస్యలను తగ్గించి, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ కంటైనర్లకు బదులుగా గాజు సీసాలో నిల్వ చేయడం మంచిది

3 / 5

కర్పూరం కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కీళ్లవాత నొప్పులు, వీపు నొప్పి, కండరాలు పట్టేయడం నుండి ఉపశమనం కలిగిస్తుంది. కర్పూరం చర్మంపై వెచ్చని అనుభూతిని కలిగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పులతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
శుభ్రమైన, పొడిగా ఉన్న గాజు సీసాలో 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోండి . రెండు చిన్న కర్పూరం బిళ్లలను తీసుకుని మెత్తని పొడిలా చేయండి. ఈ కర్పూరం పొడిని నువ్వుల నూనెలో వేసి బాగా కలపాలి. కర్పూరం పూర్తిగా కరిగే వరకు కలపడం ముఖ్యం. సీసా మూత గట్టిగా పెట్టి, ఒక గంట పాటు సూర్యరశ్మి తగిలేలా ఎండలో ఉంచాలి. ఎండ బాగా ఉన్న రోజున మాత్రమే ఈ ఆయిల్ ను తయారు చేసుకోవడం మంచిది.ఈ ఆయిల్ ను ఉదయం లేదా మధ్యాహ్నం సూర్యరశ్మి ఉన్న సమయంలో మాత్రమే నొప్పి ఉన్న కీళ్లపై అప్లై చేయాలి. రాత్రిపూట వాడకూడదు.  ప్రతిరోజూ వాడేటప్పుడు అరగంట పాటు సూర్యరశ్మిలో ఉంచడం ద్వారా నూనె మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

5 / 5
Follow Us