AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulli Raju: తెలుగులో మోస్ట్ వాంటెడ్ ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?

గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్. అందులో అతను చెప్పిన డైలాగులు, ఎక్స్ ప్రెషన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు.

Bulli Raju: తెలుగులో మోస్ట్ వాంటెడ్ ఛైల్డ్ ఆర్టిస్ట్..  ఇప్పుడు బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?
Child Artist Bulli Raju
Basha Shek
|

Updated on: Oct 14, 2026 | 3:43 PM

Share

విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయాడు బుల్లిరాజు అలియాస్ రేవంత్. వెంకటేష్ కుమారుడి పాత్రలో అతను చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. తన తండ్రిని ఇబ్బందిపెట్టిన వారిపై బూతులు తిడుతూ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు రేవంత్. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో బుల్లి రాజుకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత శ్రీ విష్ణు సింగిల్ సినిమాలో యాక్ట్ చేశాడు బుల్లిరాజు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు, నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఓ రాజు సినిమాల్లోనూ మెరిశాడీ ఛైల్డ్ ఆర్టిస్ట్. ఇక ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు బుల్లిరాజు. ఇలా మొత్తానికి స్టార్ హీరోల సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు బుల్లిరాజు. ఈ నేపథ్యంలో ఈ బాలనటుడి రెమ్యునరేషన్ ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం సినిమా బడ్జెట్‌ను బట్టి బుల్లి రాజు ఒక రోజుకు ఏకంగా లక్ష రూపాయలు తీసుకుంటున్నాడట. అలాగే భారీ బజ్ ఉన్న సినిమాలకి ఈ పారితోషికం మరింత పెరుగుతోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్లే. వీటిలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం బుల్లితెర రెమ్యునరేషన్ వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అలాగే ని బుల్లి రాజు గాని అతని పేరెంట్స్ కానీ ఎక్కడా ఈ రెమ్యునరేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. సాధారణంగా సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టులకు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఉండదు. అయితే బుల్లిరాజుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనకాడడం లేదని తెలుస్తోంది. ఇక బుల్లిరాజు కోసమే కొందరు దర్శకులు తమ సినిమాల్లో కొన్ని కామెడీ ట్రాక్ లు కూడా రాసుకుంటున్నారని సమాచారం.

ఇక రీసెంట్ గా రోహన్ తెల్ల కాగితం సినిమాలో నటించాడు బుల్లి రాజు. అలాగే శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన కామ్రేడ్ కల్యాణ్ సినిమాలోనూ కనిపించాడు. ప్రస్తుతం ఈ బుడ్డోడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us