Telangana Politics: తెలంగాణ ముఖచిత్రం.. రాజకీయ రణరంగం.. తొలి యుద్ధం అదేనా?
తెలంగాణలో ఇంకా ఎన్నికలు వేడి తగ్గలేదు.. పోస్ట్ ఎలక్షన్ హీట్ ఇంకా రగులుతూనే ఉంది. పథకాల నుంచి ఫైల్స్ మాయం వరకూ కాకరేపుతున్నాయి రాజకీయాలు.. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేస్తూనే రైతుబంధు పథకాన్ని ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్‌రావు. అధికారంలోకి వచ్చిన వెంటనే 15వేలు ఇస్తామన్న మాట ఏమైందంటూ నిలదీశారు. సమయం, సందర్భం చూసుకుని ఇస్తామన్న మంత్రులు.. దీనిపై తాజాగా ఫోకస్ పెట్టారు.

Big News Big Debate: తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భరోసాగా మారిన రైతుబంధు ఎప్పుడంటోంది విపక్షం. పాత లెక్కలు తేల్చిన తర్వాతే కొత్త నిబంధనలతో ఇస్తామంటోంది అధికారపక్షం. ఇక వరుసగా ఎమ్మెల్యే కార్యాలయాల్లో శిలాఫలకాల విధ్వంసంపై భగ్గమంటోంది బీఆర్ఎస్. మరోవైపు మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్ మాయంపై మాజీమంత్రుల పాత్ర ఉన్నా వదిలేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు.
తెలంగాణలో ఇంకా ఎన్నికలు వేడి తగ్గలేదు.. పోస్ట్ ఎలక్షన్ హీట్ ఇంకా రగులుతూనే ఉంది. పథకాల నుంచి ఫైల్స్ మాయం వరకూ కాకరేపుతున్నాయి రాజకీయాలు.. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేస్తూనే రైతుబంధు పథకాన్ని ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్‌రావు. అధికారంలోకి వచ్చిన వెంటనే 15వేలు ఇస్తామన్న మాట ఏమైందంటూ నిలదీశారు. సమయం, సందర్భం చూసుకుని ఇస్తామన్న మంత్రులు.. దీనిపై తాజాగా ఫోకస్ పెట్టారు. ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ కూడా చేశారు. రైతుభరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయంతో పాటు కౌలురైతులకు, కూలీలకు సాయం అందించాలి. వరికి బోనస్ ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే విధివిధానాలు ప్రకటించిన నిధులు విడుదల చేస్తామంటోంది ప్రభుత్వం. భూస్వాములకు, బడాబాబులకు రైతుబంధు ఇచ్చారని.. దీనిపై సమీక్షించి అర్హులకు మాత్రమే ఇస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.
మరోవైపు మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్, ఫర్నీచర్ తరలించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మాజీ మంత్రుల పాత్ర ఉన్నా వదిలేది లేదంటున్నారు పోలీసులు.
మంత్రుల కార్యాలయాలపై రచ్చ నడుస్తుండగానే… అటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల్లో విధ్వంసంపై మండిపడుతోంది బీఆర్ఎస్. మాజీల పేర్లున్నాయని శిలాఫలకాలు ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ప్రజాఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఉందంటున్నారు విపక్ష నేతలు.
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మొత్తానికి అటు పథకాలపై మాటలతూటాలు… ఇటు మంత్రుల కార్యాలయాల నుంచి ఎమ్మెల్యేల ఆఫీసుల దాకా రణగణలతో తెలంగాణ రాజకీయాలే హీటెక్కిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికంగా ఎమోషన్‌లో భాగంగా వచ్చిన రియాక్షనా? భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రమా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
