Gold Prices: బంగారం ధరల్లో మరో భారీ క్రాష్.. రూ.1.25 లక్షలకు పతనం..! త్వరలోనే పేలనున్న బబుల్
గోల్డ్, సిల్వర్ ధరలు కుప్పకూలుతున్నాయి. రోజురోజుకి పడిపోతూ కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పతనం కావడం శుభవార్తగా చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో మరో వార్త బయటకు వచ్చింది. త్వరలో బంగారం ధరల తగ్గుదల కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా భారీగా క్రాష్ అవుతున్నాయి. రోజురోజుకి డౌన్ అవుతూ వస్తోన్నాయి. ఈ నెలలో పసిడి ధరలు పతనమవుతూ కొనుగోలు చేసేవారికి పెద్ద ఊరట ఇస్తున్నాయి. డాలర్ బలపడటం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యల్బణం భయాల క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు వ్యతిరేక దిశలో లాగుతుండటంతో ప్రస్తుతం బంంగారం ధరలు సంక్లిష్టమైన ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరల తగ్గుదల మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని చెబుతున్నారు.
త్వరలో మరింత పడనున్న ధరలు
బంగారం ధరలో త్వరలో మరింత పడిపోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. త్వరలో భారత్‌లో తులం బంగారం రూ.1.25 లక్షల నుంచి రూ.1.27 లక్షలకు పడిపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ బంగారం ధరలు ఔన్సుకు 4,200 డాలర్ల నుంచి 4250కు చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికా-ఇరాన్ యుద్దం ప్రారంభమైన సమయంలో చూసుకుంటే..దేశంలో బంగారం ధరలు రూ.1.60 లక్షల వద్ద ఉన్నాయి. ఇక గత వారానికి రూ.1,44,825కి చేరుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 4,574 డాలర్లకు పడిపోయింది. దీంతో త్వరలో మరోసారి కుప్పకూలే అవకాశముందని అంటున్నారు.
కారణాలు ఇవే..
యూఎస్ డాలర్ బలపడటంతో గోల్డ్ రేట్లు తగ్గిపోతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ గత కొన్ని వారాలుగా సుమారు 95.50 నుంచి 100 స్థాయికి పెరిగింది. డాలర్ బలపడటంతో పాటు యూఎస్ బాండ్ దిగుమతులు పెరుగుతుండటంపై బంగారంపై ప్రభావం చూపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రిస్క్ ఆస్తులలో క్షీణత, మార్జిన్ కాల్స్, ద్రవ్యత కొరత కారనంగా అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. బంగారంలో లాంగ్ లిక్విడేషన్‌కు ఇది కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, ముడి చమురు ధరలు పెరగడంతో బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ వేసింది. భవిష్యత్తులో రూ.1.40 లక్షల నుంచి రూ.1.47 లక్షల మధ్య స్థిరపడే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రూ.1.27 లక్షలకు కూడా పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. కాగా శనివారం హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,900కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,540కి పడిపోయింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,52,190గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,510గా కొనసాగుతోంది. అటు సిల్వర్ ధరలు కూడా కుప్పకూలుతున్నాయి. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2,59,900గా ఉంది. నిన్న రూ.2.60 లక్షలుగా ఉంది. రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.
