Watch Video: ఆ రెండు రంగాలను కాపాడండి.. సీఎం రేవంత్‌కు మల్లా రెడ్డి ప్రత్యేక వినతి
మరో రెండు మూడు రోజుల్లో మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మాజీ మంత్రి మల్లా రెడ్డి తెలిపారు. సోమవారం యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌ను ఆయన పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు.
మరో రెండు మూడు రోజుల్లో మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మాజీ మంత్రి మల్లా రెడ్డి తెలిపారు. సోమవారం యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌ను ఆయన పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇప్పుడు కేటీఆర్ మంత్రిగా లేని ఐటీ రంగాన్ని ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారని అన్నారు. అలాగే తాము స్థానిక ఎమ్మెల్యేలను ఓడించేందుకు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసాము తప్ప.. కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాదని గ్రామీణ ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు మల్లా రెడ్డి అన్నారు.
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

