Telangana: అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్ల పహాడ్‌కు చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ప్రవీణ్‌కుమార్‌ (41) చిన్న కుమారుడు. హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ చదివిన ప్రవీణ్ కుమార్ కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఐదేళ్ల క్రితం ప్రవీణ్ కుమార్ అమెరికాకు వెళ్లాడు. అమెరికాలోని అంటాంట్లా ప్రాంతంలో ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని..

Telangana: అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే
Thapsi Praveen
Follow us
M Revan Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Aug 26, 2024 | 3:40 PM

సూర్యాపేట, ఆగస్టు 26: అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి స్విమ్మింగ్‌పూల్‌లో పడి చనిపోయాడు. న్యూమెక్సికోలో ఇంటి సమీపంలోని స్విమింగ్‌పూల్‌ వద్దకు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం (ఆగస్టు 24) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్ల పహాడ్‌కు చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ప్రవీణ్‌కుమార్‌ (41) చిన్న కుమారుడు. హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ చదివిన ప్రవీణ్ కుమార్ కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఐదేళ్ల క్రితం ప్రవీణ్ కుమార్ అమెరికాకు వెళ్లాడు. అమెరికాలోని అంటాంట్లా ప్రాంతంలో ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అక్కడే తన భార్య శాంతితో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే శనివారం ఉదయం 8 గంటలకు ఇంటి సమీపంలోని స్విమింగ్‌పూల్‌ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాక పోవడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయాడు. ప్రవీణ్ చనిపోయిన విషయాన్ని ఆయన భార్య శాంతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.

దీంతో పాతర్ల పహాడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకుచ్చేందుకు రెండు రోజుల సమయం పట్టొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ కుమార్ భౌతికకాయాన్ని త్వరగా ఇండియాకు తీసుకువచ్చేందుకు సహాయ పడాలని జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కుటుంబ సభ్యులను కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.