DK Shiva Kumar: హైదరాబాద్ చేరుకున్న డీకే శివకుమార్.. ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు..
తెలంగాణ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ స్పెషల్ ఆపరేషన్‌ను నిర్వహించింది. గెలుపొందిన ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు దాటి అభ్యర్థులు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ దగ్గరే ఏఐసీసీ పరిశీలకులు ఉండనున్నారు. ఇప్పటికే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. హోటల్ తాజ్‌కృష్ణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించనున్నారు.

తెలంగాణ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ స్పెషల్ ఆపరేషన్‌ను నిర్వహించింది. గెలుపొందిన ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు దాటి అభ్యర్థులు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ దగ్గరే ఏఐసీసీ పరిశీలకులు ఉండనున్నారు. ఇప్పటికే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. హోటల్ తాజ్‌కృష్ణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించనున్నారు. కాసేపట్లో తెలంగాణకు పలువురు ఏఐసీసీ నేతలు రానున్నారు.
కర్నాటక నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పిలిపించింది. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేని పంపనున్నట్లు సమాచారం. గెలిచిన వారిని హైదరాబాద్ తీసుకొచ్చే బాధ్యతల్ని కర్నాటక ఎమ్మెల్యేలకు అప్పగించింది అధిష్టానం. మరో వైపు ఐదు రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను అధిష్టానం నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణకు పరిశీలకులుగా డీకే శివకుమార్, దీపాదాస్ మున్షీ, డా. అజోయ్ కుమార్, కే. మురళీధరన్, కేజే జార్జ్ లను నియమించింది. సీఎల్పీ సమావేశాన్ని సమన్వయం చేయడమే అబ్జర్వర్ల బాధ్యతగా పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ప్రత్యేక బస్సుల్లో కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే మూడు బస్సులను సిద్దం చేసినట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..