Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harish Rao: ట్రబుల్ షూటర్ ఈ ట్రబుల్స్‌ని ఫేస్ చేసేనా? సమస్యలు చుట్టుముట్టిన వేళ అందరి దృష్టి ఆయనపైనే..

Telangana Health Minister: ఇంతకాలం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు మరో అదనపు బాధ్యతను అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్థిక శాఖకు అదనంగా ఖాళీగా

Minister Harish Rao: ట్రబుల్ షూటర్ ఈ ట్రబుల్స్‌ని ఫేస్ చేసేనా? సమస్యలు చుట్టుముట్టిన వేళ అందరి దృష్టి ఆయనపైనే..
Harish Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 13, 2021 | 9:30 AM

Telangana Health Minister: ఇంతకాలం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు మరో అదనపు బాధ్యతను అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్థిక శాఖకు అదనంగా ఖాళీగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను కట్టబెట్టారు. అయితే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీష్ రావు కు ఆ శాఖలో ఉన్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటన్నిటినీ ఆ ఎలా అదిగమిస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో కనిపిస్తుంది. ఇంతకీ వైద్య ఆరోగ్యశాఖలో పేరుకుపోయిన సమస్యలు ఎంటి? ట్రబుల్ షూటర్ ఆ సమస్యలను ఎలా ఫేస్ చేయబోతున్నారు..?

చిన్న మార్పుతో ఆర్థిక మంత్రి హరీష్ రావు కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది ప్రభుత్వం. కరోనా మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తలు హల్ చేస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖను డీల్ చేయడం మామూలు విషయం కాదని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇక ఇలా బాధ్యతలు తీసుకున్నారో.. లేదో.. అప్పుడే ఒక్కోక్కటిగా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మంత్రి హరీష్ రావు పెను సవాళ్లను ఎదుర్కోబోతున్నారు అని విశ్లేషణలు మొదలయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆసుపత్రులను గుర్తించి మెరుగుపరచాల్సిన అవసరం మొదటగా కనిపిస్తోంది. సరిపోని వైద్య సిబ్బంది, ఆసుపత్రుల్లో సదుపాయాల కొతర, ముఖ్యంగా చాలా వరకు పనిచేయని ఎక్విప్మెంట్ లను బాగు చేయడమా? లేక రీప్లేస్ చేయడమా? అనే దానిపై ఒక నిర్ణయం వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్‌సి లలో వైద్య సిబ్బందికి కనీస సదుపాయాలు లేక డ్రెస్సింగ్ రూమ్, బాత్ రూమ్, మంచినీరు లాంటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందితో పాటు రోగాల బారిన పడిన రోగులకు కూడా బాత్రూమ్‌ లు లేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం అవతున్నారు వైద్య సంఘాల నాయకులు.

ఇవన్నీ ఒక వైపు అయితే మరో వైపు ఆరోగ్య శాఖలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారులు, సంఘాల పేరుతో రెండుగా చీలిన డాక్టర్స్, లంచం ఇవ్వకుంటే ప్రాణాలు పోతున్నా పట్టించుకొని కింది స్థాయి సిబ్బంది, పెండింగ్‌లో ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణం, కూలడానికి సిద్ధంగా ఉన్న కోటి లోని ఈఎన్‌టి ఆసుపత్రి ఒపి బ్లాక్, గందరగోళంగా మారిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్.. ఇక మరో వైపు రాబందుల్లా మారిన ప్రవేటు హాస్పిటల్స్ ఇలా ఏ వైపు చూసినా సవాళ్లు దర్శనమిస్తున్నాయి. అధికారుల్లో లేని సఖ్యత, ఓకే వ్యక్తికి అనేక పదవులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ డైరెక్టర్ పదవులపై రగడ. ఇలా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్య మెడికల్ మాఫియాకి ఏ విధంగా కళ్లెం వేస్తారు ప్రజా ప్రాణాల్ని ఎలా కాపాడుతారు అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది.

ఇక కోవిడ్ మూడోదశను అధిగమించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కోవిడ్ మరణాలకు సంబంధించిన పరిహారాన్ని సకాలంలో అందించడం, కోవిడ్ మరణాలకు సంబందించిన లెక్కలు?.. ఇప్పుడు కోవిడ్ మరణాలకు సంబందించిన ఎక్స్ గ్రేషియా కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య దిమ్మదిరిగే రేంజ్ లో కనబడుతోంది. ఇలాంటి సమస్యను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఎలా అధిగమిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

Also read:

Molestation Case: గుజరాత్‌ కోర్టు సంచలన తీర్పు.. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కీచకుడికి నెల రోజుల్లోనే శిక్ష..

Hockey India: మరోసారి టీమిండియాను ఛాంపియన్‌ చేస్తాం.. సరికొత్త వ్యూహాలతో బరిలోకి: వివేక్ సాగర్

Andhra Pradesh: నడిరోడ్డుపై మందుబాబు రచ్చ.. పోలీసులు చెప్పినా విననన్నాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..