Hyderabad News: లేడీ కాదు పెద్ద కిలాడీ.. 2 కోట్ల అప్పు తీర్చేందుకు మాస్టర్ ప్లానే వేసింది.. అది తెలిసి పోలీసులు షాక్..
Hyderabad News: ఒక్కసారిగా ఎదిగిపోవాలనే ఆశతో పరిమితికి మించి అప్పులు చేసింది.. ఆపై నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీర్చడం కష్టమైంది. అయితే, చేసిన అప్పులను తీర్చేందుకు...
Hyderabad News: ఒక్కసారిగా ఎదిగిపోవాలనే ఆశతో పరిమితికి మించి అప్పులు చేసింది.. ఆపై నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీర్చడం కష్టమైంది. అయితే, చేసిన అప్పులను తీర్చేందుకు న్యాయమార్గం కాకుండా.. అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. అప్పులను తీర్చేందుకై మాస్టర్ ప్లాన్‌నే వేసింది. నకిలీ నోట్లతో అప్పు ఇచ్చిన వారికి టోకరా వేయాలని యోచించింది. అయితే, అనుకోని రీతిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకెళితే.. చేసిన అప్పులను నఖీలీ నోట్లతో తీర్చుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది ఓ లేడి కిలాడి. హైదరాబాద్ గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్టేషన్ పరిధి షాహిద్ నగర్, ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సోహైల్ అదే ప్రాంతానికి చెందిన సమీనా అలియాస్ రూహి కి ప్లాట్ కొనుగోలు కోసం రూ. 15 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తాజాగా తాను ఇచ్చిన రూ. 15 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగాడు. దీంతో తన అనుచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. నకిలీ నోట్లు ఇచ్చి అప్పు చెల్లించే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో రూహి తన సహచరులతో కలిసి ఒ ప్లాస్టిక్ బ్యాగ్‌లో డబ్బులు పట్టుకొచ్చింది. ఆ బ్యాగ్‌లో 2000, 500 నోట్ల కట్టలు 15 ఉన్నాయి. అయితే పైన ఒరిజినల్ నోట్లు, లోపల మాత్రం సినిమాలో ఉపయోగించే నోట్ల కట్టలు పెట్టి ఇచ్చారు. ఆ నఖీలీ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్టాంప్ వేసి ఉంది. దీన్ని గుర్తించిన సోహైల్ వారిని నిలదీశాడు. దాంతో ఆ ముగ్గురూ బ్యాగ్ తో సహా పరారయ్యారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు.. నిందితులు ధనావత్ రాజ్, సుదర్శన్, ఎఎస్ కిషోర్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా రూహి గతంలో తన సమీప బంధువులు, ఇతరుల వద్ద రూ. 2 కోట్ల వరకు అప్పులు చేసి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టింది. ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇలా ఫేక్ నోట్లతో అప్పులు చెల్లించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.
Also read:
Womens Cricket: న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే..