Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens Cricket: న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి న్యూజిలాండ్‌ క్రికెట్‌(NCZ) శుక్రవారం పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది..

Womens Cricket: న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2021 | 9:35 AM

న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి న్యూజిలాండ్‌ క్రికెట్‌(NCZ) శుక్రవారం పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఒక టీ-20, ఐదు వన్డే మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న తొలిగే టీ-20 మ్యాచ్‌తో భారత పర్యటన ఆరంభం కానుంది. కాగా మార్చి- ఏప్రిల్‌ మధ్య కాలంలో న్యూజిలాండ్‌ వేదికగానే మహిళల వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగానే బీసీసీఐ ఈ సిరీస్‌ ఏర్పాటుచేసింది.

న్యూజిలాండ్‌లోని ఫాస్ట్‌ అండ్‌ బౌన్సీ పిచ్‌లతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితులకు భారత మహిళలు బాగా అలవాటు పడేందుకు ఈ టోర్నీని నిర్వహించనుంది. కాగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు చివరిసారిగా 2019 జనవరిలో తలపడ్డాయి. న్యూజిలాండ్‌ ఆతిథ్యమిచ్చిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో చేజిక్కించుకోగా, మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను కివీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

న్యూజిలాండ్‌లో భారత మహిళల జట్టు షెడ్యూల్‌ ఇదే. మొదటి టీ-20 మ్యాచ్‌- ఫిబ్రవరి9- నేపియర్‌ మొదటి వన్డే – ఫిబ్రవరి11- నేపియర్‌ రెండో వన్డే – ఫిబ్రవరి14- నెల్సన్‌ మూడో వన్డే – ఫిబ్రవరి16- నెల్సన్‌ నాలుగో వన్డే – ఫిబ్రవరి 22- క్వీన్స్‌టౌన్‌ ఐదో వన్డే – ఫిబ్రవరి 25 – క్వీన్స్‌టౌన్‌

Also Read:

Hockey India: మరోసారి టీమిండియాను ఛాంపియన్‌ చేస్తాం.. సరికొత్త వ్యూహాలతో బరిలోకి: వివేక్ సాగర్

Asian Games 2022: ఆర్చరీ ఈవెంట్లను పెంచిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్.. 2022 ఆసియా గేమ్స్‌లో ఎన్ని ఈవెంట్లలో పోటీలంటే?

World Chess Championship 2021: సరికొత్త పాత్రలో విశ్వనాథన్ ఆనంద్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌2021లో ఏం చేయనున్నాడంటే?

Virat Kohli: కోహ్లీకి చెప్పి మరీ వికెట్ తీసిన దమ్మున్నోడు
Virat Kohli: కోహ్లీకి చెప్పి మరీ వికెట్ తీసిన దమ్మున్నోడు
జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!
జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!
నటి సమంత కోసం గుడి కట్టిన తెలుగు అభిమాని..
నటి సమంత కోసం గుడి కట్టిన తెలుగు అభిమాని..
ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
ఆ మూవీని రిలీజ్ చేయద్దు.. శివసేన హెచ్చరిక..ఇంతకీ ఏముందీ సినిమాలో?
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?