- Telugu News Photo Gallery Sports photos Viswanathan Anand to do commentary during world chess championship in dubai
World Chess Championship 2021: సరికొత్త పాత్రలో విశ్వనాథన్ ఆనంద్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్2021లో ఏం చేయనున్నాడంటే?
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 16 వరకు దుబాయ్‌లో జరగనుంది. ఐదుసార్లు మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆనంద్ అధికారిక వ్యాఖ్యాతలలో ఒకరిగా ఎన్నికయ్యారు.
Updated on: Nov 13, 2021 | 8:54 AM

భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ కొత్త పాత్రతో పోటీ ఒత్తిడి లేకుండా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్, రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచి మధ్య జరిగిన ఘర్షణను వ్యాఖ్యానించేందుకు సిద్ధమయ్యారు. అంటే కామెంటేటర్‌గా మరోపాత్రను పోషించేందుకు రెడీ అయ్యాడన్నమాట.

నవంబర్ 24 నుంచి డిసెంబర్ 16 వరకు దుబాయ్‌లో ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఐదుసార్లు మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆనంద్ అధికారిక వ్యాఖ్యాతలలో ఒకరిగా ఎన్నికయ్యారు. 'ఇది సరదాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను దీన్ని ఇప్పటికే ఆన్‌లైన్‌లో చేశాను. ఆఫ్‌లైన్‌లో ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను' అంటూ చెప్పుకొచ్చారు.

వ్యాఖ్యాతగా ఆఫర్ ఎలా వచ్చిందనే ప్రశ్నకు బదులిస్తూ.. "FIDE నన్ను ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కి వ్యాఖ్యానం చేయాలని అడిగారు. నేను ఎందుకు ప్రయత్నించకూడదు. అందుకే ఒప్పుకున్నాను" అని చెప్పాడు.

'ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రపం చ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆడే ఒత్తిడి లేకుండా ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను చెస్‌కి అభిమానిని. ఇది మంచి మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నాను. గతంలో కూడా కొన్ని ఆన్‌లైన్ పోటీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాను' అంటూ చెప్పుకొచ్చారు.





























