Cute Animal: క్యూట్ యానిమల్ ఎంత బావుందో.. అసలేంటిది? అందరినీ ఆకట్టుకుంటున్న ఆల్పాకా.. వైరల్‌ అవుతున్న వీడియో

Cute Animal: క్యూట్ యానిమల్ ఎంత బావుందో.. అసలేంటిది? అందరినీ ఆకట్టుకుంటున్న ఆల్పాకా.. వైరల్‌ అవుతున్న వీడియో

Anil kumar poka

|

Updated on: Nov 16, 2021 | 9:22 AM

ఒంటినిండా తెల్లని బొచ్చుతో మెరిసిపోతూ.. బ్లూ బెర్రీలను తింటూ ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది కదూ ఈ జంతువు. దీనికి బెర్రీలు అంటే ఇష్టం అనుకుంటా.. ఎంతో ఇష్టంగా తింటుంది. అంతేనా క్యూట్‌ క్యూట్‌గా వయ్యారాలు పోతూ నగర వీధుల్లో షికార్లు చేస్తున్న ఈ జంతువు పేరు అల్పాకా.


ఒంటినిండా తెల్లని బొచ్చుతో మెరిసిపోతూ.. బ్లూ బెర్రీలను తింటూ ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది కదూ ఈ జంతువు. దీనికి బెర్రీలు అంటే ఇష్టం అనుకుంటా.. ఎంతో ఇష్టంగా తింటుంది. అంతేనా క్యూట్‌ క్యూట్‌గా వయ్యారాలు పోతూ నగర వీధుల్లో షికార్లు చేస్తున్న ఈ జంతువు పేరు అల్పాకా. ఇదొకరకమైన ఒంటె. కానీ మనం ఎప్పుడూ చూసే ఒంటెలకు దీనికి ఏమాత్రం పోలికలుండవు. అయితే తాజాగా ఓ అందమైన అల్పాకా… అల్పాహారంగా… బ్లూబెర్రీస్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియోలో అల్పాకా… ప్రత్యేకంగా రెండు ప్లాస్టిక్ కొమ్ములను తగిలించుకుంది. తెల్లటి అల్పాకాకి ఓ వ్యక్తి బ్లూబెర్రీస్ పెడుతుంటే… అది అతని చేతి నుంచి వాటిని నోటితో తీసుకుంటూ… నములుతోంది. ఎక్కువ జూలుతో, తెల్లగా మెరుస్తున్న ఉన్న ఈ అల్పాకా వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అల్పాకా ముఖం చూస్తే నవ్వుతున్నట్లు ఉందంటూ మెచ్చుకుంటున్నారు. ఇది రోడ్లపై పరుగులు పెడుతూ… అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటోంది.

దాదాపు 9వేల సంవత్సరాలుగా మనుషులు వీటిని పెంచుకుంటున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దక్షిణ అమెరికాలో చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దగ్గర గొర్రెలు, మేకల్ని పెంచుకున్నట్లే… అక్కడ చాలా మంది వీటిని పెంచుతూ… ఆదాయం సంపాదించుకొంటున్నారు. దక్షిణ అమెరికాకి చెందిన ఈ పెంపుడు జంతువులు ప్రస్తుతం అంతరించిపోయే జాతుల లిస్టులో ఉన్నాయి.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 16, 2021 09:17 AM