Molestation Case: గుజరాత్ కోర్టు సంచలన తీర్పు.. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కీచకుడికి నెల రోజుల్లోనే శిక్ష..
సాధారణంగా లైంగిక దాడి, హత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష ఖరారు కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో నెలలు పడితే మరికొన్ని కేసుల్లో ఏళ్లు గడుస్తుంటాయి.
సాధారణంగా లైంగిక దాడి, హత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష ఖరారు కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో నెలలు పడితే మరికొన్ని కేసుల్లో ఏళ్లు గడుస్తుంటాయి. అందుకు న్యాయశాస్త్రంలో ఉన్న కొన్ని లొసుగులే కారణం. ‘ సరైన సమయానికి న్యాయం అందకపోవడం కూడా అన్యాయమే’ అన్నట్లు దీర్ఘకాల విచారణలు, దర్యాప్తులతో బాధిత కుటుంబాలకు సరైన న్యాయం దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి నెలరోజుల్లోనే శిక్ష విధించింది గుజరాత్ న్యాయస్థానం. దోషికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.
మాయమాటలతో హత్యాచారం.. గుజరాత్‌లోని సూరత్ పట్టణానికి చెందిన అజయ్ నిషద్ గత నెల 12న తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి మాయ మాటలు చెప్పి అపహరించాడు. అనంతరం దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఆ బాలికను హతమార్చి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. అయితే చిన్నారి కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్టోబర్ 13న నిషద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల్లోనే అతనిపై ఛార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. గుజరాత్ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 25న ఈ కేసు విచారణను ప్రారంభించింది. నిషద్ దోషి అని తేలడంతో అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాలా గురువారం వెలువరించారు. అయితే గుజరాత్‌లోని ఓ ట్రయల్ కోర్టు అది కూడా హత్యాచార కేసులో ఇంత తక్కువ సమయంలో తీర్పు ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also read:
Viral News: బంగారంతో మాస్క్‌ను తయారుచేసిన ఆభరణాల వ్యాపారి.. ధర ఎంతో తెలుసా..
Sabarimala: 15న తెరచుకోనున్న శబరిమల ఆలయం.. దర్శనానికి వెళ్లే భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
కీచకోపాధ్యాయుడు.. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం.. బాలిక బలవన్మరణం