Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: 15న తెరచుకోనున్న శబరిమల ఆలయం.. దర్శనానికి వెళ్లే భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతుండడంతో పుణ్యక్షేత్రాల్లో అమలవుతోన్న కరోనా ఆంక్షలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం(నవంబర్‌15) నుంచి శబరిమల ఆలయం కూడా తెరచుకోనుంది..

Sabarimala: 15న తెరచుకోనున్న శబరిమల ఆలయం.. దర్శనానికి వెళ్లే భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2021 | 7:36 AM

కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతుండడంతో పుణ్యక్షేత్రాల్లో అమలవుతోన్న కరోనా ఆంక్షలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం(నవంబర్‌15) నుంచి శబరిమల ఆలయం కూడా తెరచుకోనుంది. మండల మకర విళక్కు పండగ సందర్భంగా రెండు నెలల పాటు కరోనా నిబంధనలు పాటిస్తూ రోజుకు 30 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. 15న సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో గర్భగుడిని తెరుస్తారు. 16 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతినిస్తారు. డిసెంబర్‌ 26న మండల పూజ ముగుస్తుంది. డిసెంబర్‌ 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

నిబంధనలివే.. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారు లేదా శబరిమలను సందర్శించుకునే ముందు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకున్న వారికే దర్శనానికి అనుమతినిస్తారు. దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఆధార్‌ ఒరిజినల్‌ను చూపించాల్సి ఉంటుంది. యాత్రలో ఎలాంటి ప్లాస్టిక్‌ వస్తువులను అనుమతించరు. ఇక పంపానదిలో స్నానానికి అనుమతి ఉంటుంది కానీ బస చేసేందుకు అనుమతి లేదు. దర్శనం పూర్తైన వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవాలి. ఇక నెయ్యి అభిషేకంలో భాగంగా భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. భక్తులకు అక్కడే నెయ్యిని తిరిగి ఇస్తారు.

Also read:

Medaram Jatara 2022: కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆదివాసి జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..

Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా కూల్.. స్వతహాగా అస్సలు కోపం తెచ్చుకోరు.!

Kartik Purnima: కార్తీక పౌర్ణమిరోజున పాక్షిక చంద్రగ్రహణం.. మనదేశంలో ఎక్కడ కనిపించనున్నదంటే..