AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బంగారంతో మాస్క్‌ను తయారుచేసిన ఆభరణాల వ్యాపారి.. ధర ఎంతో తెలుసా..

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరైపోయింది. అయితే కొంతమంది మాస్క్‌ ధరించడంలోనూ సృజనాత్మకత, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు

Viral News: బంగారంతో  మాస్క్‌ను తయారుచేసిన ఆభరణాల వ్యాపారి.. ధర ఎంతో తెలుసా..
Basha Shek
|

Updated on: Nov 13, 2021 | 8:17 AM

Share

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరైపోయింది. అయితే కొంతమంది మాస్క్‌ ధరించడంలోనూ సృజనాత్మకత, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేసిన మాస్కుల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఆభరణాల వ్యాపారి బంగారంతో మాస్క్‌ రూపొందించాడు. దక్షిన 24 పరగణాల జిల్లా బడ్జ్‌ పట్టణానికి చెందిన చందన్‌ దాస్‌ రూ.5.70లక్షలను ఖర్చుచేసి ఈ గోల్డెన్‌ మాస్క్‌ను తయారుచేశాడు. సుమారు 108 గ్రాముల బరువున్న ఈ మాస్క్‌ను తయారుచేయడానికి అతనికి15 రోజులు పట్టిందట. బంగారు ఆభరణాలు ధరించడమంటే ప్రత్యేక ఆసక్తి చూపే చందన్‌ పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ మాస్క్‌ను ధరిస్తాడట.

దొంగలతో జాగ్రత్త నాయనా.. ‘నాకు బంగారు ఆభరణాలు ధరించడమంటే చాలా ఇష్టం. నా మెడలో ఉన్న గొలుసులు, చేతి వేళ్లుకు ఉన్న ఉంగరాలు, మణికట్టుకు ధరించిన బ్రాస్‌లెట్‌ అన్నీ బంగారంతో తయారుచేసినవే. అందులో భాగంగానే గోల్డెన్‌ మాస్క్‌ను తయారుచేశాను. గత నెల కోల్‌కతాలోని దుర్గామాత పూజకు ఈ మాస్క్‌ ధరించే వెళ్లాను. కానీ చాలామంది ఈ విషయం గ్రహించి నన్ను చుట్టుముట్టారు. అందుకే తీసేశాను’ అని చెప్పుకొచ్చాడు. చందన్‌. ప్రస్తుతం ఈ గోల్డెన్‌ మాస్క్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఈ మాస్క్‌తో మీ ముఖం దగదగా మెరుస్తుంది సరే.. దొంగల కంట్లో పడితే మాత్రం క్షణాల్లో మాయమవుతుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

AP Rains: వర్షాలు, వరదలతో పొంగిపొర్లుతున్న చెరువులు.. ప్రాణాలను లెక్కచేయకుండా చేపల కోసం జనం ఫీట్లు.. ఎక్కడంటే

మరి కొన్నేళ్లలో ఈ నగరాలు మునిగిపోనున్నాయా? వీడియో

Floating Theatreసరస్సు మధ్యలో ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌.. వీడియో