Jagtial: మహిళపై దాడి చేసిన ఎస్ఐ అనిల్ సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ..

బస్సులో మహిళపై దాడి చేసిన ఆరోపణలపై జగిత్యాల రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎ. అనిల్ కుమార్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన అధికారులు.. గురువారం అనిల్ కుమార్ ను సస్పెండ్ చేశారు.

Jagtial: మహిళపై దాడి చేసిన ఎస్ఐ అనిల్ సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ..
Si Suspended
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 11, 2023 | 8:06 PM

బస్సులో మహిళపై దాడి చేసిన ఆరోపణలపై జగిత్యాల రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎ. అనిల్ కుమార్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన అధికారులు.. గురువారం అనిల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అనిల్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం కరీంనగర్‌ నుంచి జగిత్యాల వెళ్తుండగా టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సీటు విషయంలో అనిల్‌కుమార్‌ భార్య.. షేక్‌ ఫర్హా అనే మహిళ గొడవపడ్డారు. ఈ సంఘటన గురించి ఎస్‌ఐ భార్య.. అతనికి ఫోన్‌ లో చెప్పింది. దీంతో బస్సు జగిత్యాలకు చేరుకోగానే ఎస్‌ఐ.. బస్సును ఆపారు. అనంతరం ఎక్కి ఫర్హాను ప్రశ్నించారు. ఈ ఘటనను పర్హా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా.. పర్హా నుంచి ఫోన్ లాక్కున్న ఎస్ఐ ఆమెపై దాడి చేశారు. అనంతరం ఫర్హాతోపాటు ఆమె తల్లిపై పోలీసులు దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితులు జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎస్సై అనిల్‌ ఓవరాక్షన్‌పై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సైతం సీరియస్‌ అయి.. చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.

బాధితులు ఎస్పీ ఎ భాస్కర్‌ను కలవడంతో విచారణకు ఆదేశించారు. ఎస్‌ఐ, అతని భార్య, మరో కానిస్టేబుల్‌పై ఐపీసీ సెక్షన్‌ 290, 323, 341 కింద కేసు నమోదు చేసిన అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా గురువారం ఐజీ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..