Road Accidents: ఆ హైవేపై వెళ్తున్నారా ఈ జంక్షన్‎ల వద్ద జాగ్రత్త.. ప్రమాదాల నివారణకు తత్కాలిక చర్యలు..

జాతీయ రహదారులపై మృత్యుఘంటికలుమోగుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇతర కారణాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 44లో నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుని ఎంతో మంది మృత్యువాత పడుతుండగా.. మరెందరో క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. జాతీయ రహదారి-44పై ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.

Road Accidents: ఆ హైవేపై వెళ్తున్నారా ఈ జంక్షన్‎ల వద్ద జాగ్రత్త.. ప్రమాదాల నివారణకు తత్కాలిక చర్యలు..
Road Accident Palamuru
Follow us

| Edited By: Srikar T

Updated on: Jan 11, 2024 | 9:30 AM

జాతీయ రహదారులపై మృత్యుఘంటికలుమోగుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇతర కారణాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 44లో నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుని ఎంతో మంది మృత్యువాత పడుతుండగా.. మరెందరో క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. జాతీయ రహదారి-44పై ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రహదారుల నిర్మాణం, భద్రతా చర్యలు గాలికొదిలేయడంతో మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. హైవేల వెంబడి ఉన్న గ్రామాల జంక్షన్ల వద్ద నిత్యం వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా మారుతున్నాయి.

ప్రమాదాల నివారణకు ప్రదానంగా ఫైఓవర్లు, అండర్ పాస్‎ల నిర్మాణాలు లేకపోవడమేనని తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు 185కిలోమీటర్లు ఎన్ హెచ్ -44 విస్తరించి ఉంది. రహదారిపై వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. గంటకు 80కిలోమీటర్ల వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తున్నాయి. హైవేకు అనుకొని ఉన్న గ్రామాలు, మండలాలకు వచ్చే ప్రజలతో పలు ప్రాంతాలు డెంజర్ స్పాట్స్‎గా మారుతున్నాయి. బైక్‎లు, ఆటోలు సమీప గ్రామాల్లోకి వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొంటున్నాయి. జాతీయ రహదారిపై వస్తున్న వాహనాల వేగాన్ని అంచానా వేయకుండా పాదచారులు, బైక్‎లు రోడ్డు దాటడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఎన్ హెచ్ 44 పై 23 బ్లాక్ స్పాట్స్:

ఎన్ హెచ్ 44 అంటేనే గుర్తుకు వచ్చేది ప్రధానంగా డెంజర్ స్పాట్స్. అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా 23 బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. రహదారి భద్రత చర్యలు లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల ప్రజలు చేస్తున్న పొరపాట్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 2023 జనవరి నుంచి ఇప్పటివరకు 342 ప్రమాదాలు జరగగా 299మంది ప్రాణాలు కోల్పోగా.. 219 గాయపడ్డారు. తాజాగా జరిగిన బాలానగర్ రోడ్డు ప్రమాదం మరోసారి సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రమాదకరంగా బాలానగర్, రాజాపూర్ జంక్షన్స్:

జాతీయ రహదారి ఆనుకొన్ని ఇక బాలానగర్, రాజాపూర్ మండలాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. నిత్యం ఈ రెండు ప్రాంతాల్లో వాహనాలు, ప్రజలు జాతీయ రహదారిని దాటే క్రమం ఆందోళన కలిగిస్తోంది. హైవేపై వేగంగా దూసుకెళ్లే వాహనాలు స్థానికులపైకి దూసుకెళ్తున్నాయి. వాహనాలను ఢీ కొంటున్నాయి. తరచూ ఇటువంటి ఘటనలు సంభవిస్తుండడంతో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నెల 5వ తేదిన జరిగిన బాలానగర్ రోడ్డు ప్రమాదం మరోసారి హైవేపై నెత్తుటి మరకలు మిగిల్చింది. వేగంగా దూసుకువచ్చిన డీసీఎం వాహనం రోడ్డుదాటుతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాదం తర్వాత స్థానికుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఎన్నో ఏండ్లుగా బాలానగర్ వద్ద ఫ్లైఓర్ నిర్మించాలని పట్టుబడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాల నివారణకు పోలీసుల తత్కాలిక చర్యలు:

ఇక తాజాగా జరిగిన ప్రమాదంతో పోలీసులు నివారణ చర్యలకు పూనుకున్నారు. హైవేపై డెంజర్ స్పాట్స్ వద్ద వేగ నియంత్రణకు బారీకేడ్లు, స్టాఫర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవ్వన్ని తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా శాశ్వత పరిష్కారానికి ఎన్నో ఏండ్లుగా ఉన్న ప్లైఓవర్లను నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక జాతీయ రహదారిపై ఉన్న చౌరస్తాలు, జంక్షన్ల వద్ద ఎలాంటి సంతలు నిర్వహించకూడదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సంతకు వచ్చే వారు రోడ్డు దాటుతున్న క్రమంలోనే మొన్నటి బాలానగర్ రోడ్డు ప్రమాదం సంభవించిందని చెప్పారు. బాలానగర్, రాజాపూర్ వంటి జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకునేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీని కోరతామని డీఎస్సీ మహేశ్ చెప్పారు. బాలానగర్, రాజాపూర్ తో పాటు మిగిలిన జంక్షన్లు, చౌరస్తాలు నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. మొత్తం హైవైపై అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్‎లు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్