మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ షాక్‌.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు

ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరని స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని.. అలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని TSRTC ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ షాక్‌.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు

|

Updated on: Jan 10, 2024 | 9:28 PM

ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరని స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని.. అలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని TSRTC ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే, పాన్‌ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టంచేశారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌లు చూపిస్తున్నారని TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషికి నిద్ర ఒక వరం.. ఎందుకో తెలుసా ??

బైకులో నక్కిన రక్త పింజర… 100 కిలోమీటర్లు అలాగే ప్రయాణం..

ఆ రోజు అభినందన్‌ను పాక్ విడిచి పెట్టకపోతే ఏం జరిగి ఉండేది ??

అయోధ్యలో సీతమ్మ కోసం ప్రత్యేక చీర

ఆ ముహూర్తానికే బిడ్డలకు జన్మనివ్వాలి.. యూపీ గర్భిణీల ఆరాటం

Follow us