Telangana: మందేస్తూ.. చికెన్ తింటూ మృతి.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ చూసి షాక్

ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారి గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఏలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరు పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం.. చికెన్ తెచ్చి మాంచి స్పైసీగా వండుకున్నారు. తమకు ఇష్టమైన పూరీలు చేసుకున్నారు.

Telangana: మందేస్తూ.. చికెన్ తింటూ మృతి.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ చూసి షాక్
Liquor Chicken (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 10, 2024 | 7:19 PM

పుట్టుక ఎప్పుడు, చావు ఎప్పుడు అనేది ప్రకృతి ఆధీనం. ఏ రూపంలో అయినా, ఎప్పుడైనా చావు ముంచుకురావొచ్చు. తాజాగా ఓ వ్యక్తి మందు తాగుతూ, చికెన్ తింటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే.. అతడి చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అయితే వైద్యులు చెప్పిన కారణంతో కుటుంబ సభ్యుల షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే… ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారి గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఏలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరు పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం.. చికెన్ తెచ్చి మాంచి స్పైసీగా వండుకున్నారు. తమకు ఇష్టమైన పూరీలు చేసుకున్నారు. ముక్క ఉంటే మందు కూడా ఉండాలి అనుకున్నారు ఏమో.. మద్యం కూడా అప్పటికే తెచ్చిపెట్టుకున్నారు. కుకింగ్ పూర్తయిన తర్వాత.. చికెన్‌ను స్టఫ్‌గా తింటూ మద్యం తాగుతున్నారు. ఇంతలోనే విషాదం జరిగింది

మద్యం తాగుతూ చికెన్ తింటుండగా.. జితేంద్రకుమార్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఎంత లేపినా ఉలుకూ, పలుకూ లేదు. ముఖంపై నీళ్లు కొట్టినా సోయిలోకి రాలేదు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుకొని మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ధర్మేందర్ తివారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!