Hyderabad: ఈ నగరానికి ఏమైంది..?..గోనెసంచిలో డెడ్ బాడీస్‌.. వరుస ఘటనలతో కలకలం..

ఈ క్రమంలో దేవకీ సోమవారం రాత్రి రాములు ఇంటికి వెళ్లి గొడవకు దిగింది. దాంతో రాములు, భార్య శారద, భార్య చెల్లెలు విసుగెత్తిపోయారు..  దేవకిని చంపితే పిల్లవాడిని అడిగేవారు ఎవరు ఉండరని నిర్దారించుకొని ముగ్గురు కలిసి హత్య చేశారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో గొనె సంచిలో శవాన్ని బయట పడవేయడానికి తీసుకెళ్తుండగా,..

Hyderabad: ఈ నగరానికి ఏమైంది..?..గోనెసంచిలో డెడ్ బాడీస్‌.. వరుస ఘటనలతో కలకలం..
Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: May 03, 2023 | 5:36 PM

20 రోజుల వ్యవధిలో నగరంలో మూడు చోట్ల గోనెసంచిలో మృతదేహాలు లభ్యంకావటం కలకలం సృష్టిస్తోంది. నగదు లావాదేవీలు, అక్రమ సంబంధాలే శవాలు గోనే సంచిలో మూటలుగా తేలటానికి ప్రధాన కారణం గా తెలుస్తోంది. ఎక్కడో చంపేసి గోనెసంచిలో మూటకట్టి మరెక్కడో పడేస్తున్నారు. కుళ్ళిపోయి దుర్వాసన వస్తే గానీ, తమ పక్కనే శవం ఉన్న సంగతి తెలియటం లేదు. గత నెల 12 న పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీశైలం హై వే పై మహిళా మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి గోనెసంచిలో మూటకట్టి హైవే మీద రోడ్డు పక్కన పడేశారు. మూడు నాలుగు రోజుల తర్వాత అక్కడ శవం ఉన్న సంగతి గుర్తించారు. అయితే దానికి పది మీటర్ల దూరంలోనే ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్న రోజు అక్కడ అక్కడికి జనాలు వచ్చి వెళుతున్న పక్కనే ఉన్న శవాన్ని మాత్రం హోటల్ నిర్వాహకులు గుర్తించలేకపోయారు.

అక్కడున్న ఒక కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డ్ విధుల్లో భాగంగా తనిఖీ చేస్తుండగా అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన మహిళ సూర్యాపేటకు చెందిన సైదమ్మగా గుర్తించారు. అక్రమ సంబంధం ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణం అని తేల్చారు.సూర్యాపేటకు చెందిన సైదమ్మ కు ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నాడు.సైదమ్మ బడంగ్పేట్ ఎంసీఆర్ కాలనీకి కొన్నాళ్ల క్రితం వలస వచ్చింది.అదే ప్రాంతానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్దబావి శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డికి సైదమ్మకు గతంలో కొన్ని డబ్బులు ఇచ్చాడు.శ్రీనివాస్ రెడ్డి డబ్బులు తిరిగి అడగడంతో ఆమె బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి నే ప్రకారం మహిళా హత్య నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ పదో తారీకు వారు రెగ్యులర్ గా కలుసుకుని ఇంటికి వెళ్లారు ఇద్దరు కలిసి మద్యం సేవించారు ఇరువురి మధ్య గొడవ జరిగింది. పధకం ప్రకారం మహిళల హత్య చేశాడు శ్రీనివాస్ రెడ్డి. తన వాహనంలో తీసుకొచ్చి రోడ్డు మీద పడేసాడు 14 తారీకు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బాలుడిని కొన్న వ్యవహారం హత్యకు దారి తీసింది. షాద్ నగర్ ACP కుశల్కర్ కథనం ప్రకారం. షాద్ నగర్ పట్టణం పటేల్ రోడ్డు లో నివాసముండే రాములు శారద దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టిందని. తమకు మగ పిల్లాడు కావాలని వీరి ఇంటి ఎదురుగా ఉంటున్న బీహార్ కు చెందిన దేవకి, పురుషోత్తం దంపతులకు చెప్పగా వారి కొడుకును ( 6 నెలలు) అమ్మడానికి సిద్ధమయ్యిరు. ఐదు నెలల క్రితం 1,50,000 రూపాయలకు బేరం కుదుర్చుకుని డబ్బులిచ్చి పిల్లవాడిని పెంచు కుంటున్నారు. ఈ క్రమంలో దేవకి తనకు ఇచ్చిన డబ్బులు కాకుండా మరిన్ని డబ్బులివ్వాలని లేదా పిల్లాడిని తిరిగి ఇవ్వాలని రాములు దంపతులను తరచు వేధించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో దేవకీ సోమవారం రాత్రి రాములు ఇంటికి వెళ్లి గొడవకు దిగింది. దాంతో రాములు, భార్య శారద, భార్య చెల్లెలు విసుగెత్తిపోయారు..  దేవకిని చంపితే పిల్లవాడిని అడిగేవారు ఎవరు ఉండరని నిర్దారించుకొని ముగ్గురు కలిసి హత్య చేశారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో గొనె సంచిలో శవాన్ని బయట పడవేయడానికి తీసుకెళ్తుండగా .పెట్రోలింగ్ పోలీసులు అనుమానంతో అడ్డగించి సంచిలో చూడగా శవం ఉన్నట్లు గమనించి రాములును అదుపులో తీసుకొని విచారించగా జరిగిన హత్య విషయం పోలీసులకు తెలిపినట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

పసికందుకోసం హత్య చేసి గోనె సంచులు పడేసిన ఘటన జరిగిన 24 గంటల్లోనే కూకట్పల్లి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మరో మహిళా మృతదేహం కలకలం సృష్టించింది. క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు మొదట మహిళ శవం గోనె సంచి లోంచి కనిపించడంతో స్థానికులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం హత్య చేసి మహిళ మొహాన్ని గుర్తుపట్ట లేకుండా ధ్వంసం చేసినట్టుగా చెబుతున్నారు ఈ కేసు విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నామని వీలైనంత తొందరలో హంతుకులను పట్టుకుంటామని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..