Chikoti Praveen: చీకోటి గ్యాంగ్‌కు బెయిల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. థాయ్‌లాండ్‌లోనూ తీవ్ర కలకలం..!
చీకోటి ప్రవీణ్ గురించి పూర్తి విషయాలు థాయ్ పోలీసులకు తెలియకపోవడంతో విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇది చట్టవిరుద్ధమని తనకు తెలీదని, తాను అమాయకుడిని అని చెప్పి థాయిలాండ్ నుండి చీకోటి ప్రవీణ్ ఎస్కేప్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. థాయిలాండ్ లో కూడా క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గ్యాంబ్లింగ్ కేసులో ప్రభుత్వ అధికారులు 20 లక్షల భత్ లు (దాదాపు రూ.48 లక్షలు) లంచం తీసుకొని చీకోటి ప్రవీణ్ గ్యాంగ్‌ను విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ మేరకు థాయ్ మీడియాలో వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని థాయ్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
చీకోటి ప్రవీణ్ గురించి పూర్తి విషయాలు థాయ్ పోలీసులకు తెలియకపోవడంతో విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇది చట్టవిరుద్ధమని తనకు తెలీదని, తాను అమాయకుడిని అని చెప్పి థాయిలాండ్ నుండి చీకోటి ప్రవీణ్ ఎస్కేప్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. చీకోటి ప్రవీణ్‌పై ఉన్న ఇతర కేసులు వివరాలు తెలిసి థాయ్ పోలీసులు విస్మయం చెందినట్టు చెబుతున్నారు.
థాయ్‌లాండ్‌లోని పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ చీకోటి ప్రవీణ్‌కు మంగళవారం బెయిల్ మంజూరైంది. 4500 బాట్స్ జరిమానాతో చీకోటితో పాటు 83 మందికి బెయిల్ లభించింది. ఫైన్ చెల్లించడంతో ఆ వెంటనే పోలీసులు పాస్‌పోర్టులు ఇచ్చేశారు. దాంతో చికోటి అండ్ గ్యాంగ్ హైదరాబాద్‌కి బయల్దేరింది.




థాయ్‌లాండ్‌లో బెయిల్ మంజూరైన తర్వాత చికోటి ప్రవీణ్ టీవీ9తో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడారు. తానూ ఆర్గనైజర్ కాదని, తన పేరు కూడా ఎక్కడా లేదన్నారాయన. నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ అని దేవ్, సీత తనకు ఆహ్వానం పంపితే ఇక్కడికి వచ్చానన్నారు.అయితే థాయ్‌లాండ్‌లో పోకర్ ఇల్లీగలని తనకు తెలియదన్నారు. తానూ హాల్లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని, తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్నానని చికోటి ప్రవీణ్ తెలిపారు. గోవా నుంచి ఓ వ్యక్తి కాసినోపై థాయ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హోటల్ పై దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా కార్డ్‌గేమ్ ఆడుతున్నవారిని అదుపులోకి తీసున్నట్లు తెలిపారు.