TSRTC MD Sajjanar: ‘వెర్రి వేయి విధాలు అంటే ఇదే’.. రోడ్లపై పిచ్చి వేశాలు వేసే వారికి సజ్జనార్ మాస్ వార్నింగ్..

రోడ్డు ప్రమాదాలు రోజూ వందలాది మందిని బలి తీసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్ష్యం వ్యవహరించడం మూలంగానే చాలామంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ టేకింగ్, వచ్చే వాహనాలకు ఎదురుగా వెళ్లడం, వాహనాలు నడుపుతూ ఆకతాయి పనులు చేయడం.. చెప్పుకుంటూ పోతే నిత్యం సంభవించే ఎన్నో ఘటనలు.. వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.

TSRTC MD Sajjanar: ‘వెర్రి వేయి విధాలు అంటే ఇదే’.. రోడ్లపై పిచ్చి వేశాలు వేసే వారికి సజ్జనార్ మాస్ వార్నింగ్..
Tsrtc Md Vc Sajjanar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 03, 2023 | 1:25 PM

రోడ్డు ప్రమాదాలు రోజూ వందలాది మందిని బలి తీసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్ష్యం వ్యవహరించడం మూలంగానే చాలామంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ టేకింగ్, వచ్చే వాహనాలకు ఎదురుగా వెళ్లడం, వాహనాలు నడుపుతూ ఆకతాయి పనులు చేయడం.. చెప్పుకుంటూ పోతే నిత్యం సంభవించే ఎన్నో ఘటనలు.. వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల వారి ప్రాణంతోపాటు.. ఎదుటివారి ప్రాణం కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. జాగ్రత్తగా గమ్యానికి చేరుకోండి అంటూ పదే పదే పోలీసులు, ప్రముఖులు సూచిస్తుంటారు. తాజాగా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసి.. రహదారులపై ఎప్పుడూ ఇలా చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు సజ్జనార్ ఆ వీడియోను ఎందుకు షేర్ చేశారు.. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం..

ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ యువకుడు.. టీఎస్‌ఆర్టీసీ బస్సును ఓ యువకుడు వెనుక నుంచి ఓ కాలుతో బస్సును నెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. స్కూటీపై ఉన్న యువకుడు బస్సును ఓ కాలితో నెడుతూ కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఆ వీడియో ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రహదారులపై ఇలాంటివి చేయొద్దంటూ హెచ్చరించారు. వెర్రి వేయి విధాలు అంటే ఇదే!.. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి. అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

హైదరాబాద్ పరిధిలోని మిధానీ డిపోనకు చెందిన బస్సు 104-ఎ రూట్లో వెళుతుండగా.. ఓ యువకుడు స్కూటీ నడుపుతూ ఒక కాలుతో బస్సు వెనుక నెడుతుండగా.. అతని వెనుక ఫాలో అవుతున్న మరొకరు ఈ వీడియో తీశారు. అనంతరం వీడియో వైరల్‌ అయింది. అయితే, ఇలా చేయడం నేరమని.. ఇలాంటి వారిపై చట్టప్రకారం సంస్థ చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..