Telangana: పాఠశాల విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్… టెక్ట్స్ బుక్స్‌తో పాటు అవి కూడా ఫ్రీ
పాఠశాల విద్యపై సచివాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులందరికీ టెక్ట్స్ బుక్స్ బడులు ప్రారంభమయ్యే నాటికి అందజేయాలని సూచించారు. అంతే కాదు....
పాఠశాల విద్యపై కొత్త సచివాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్స్ బుక్స్… హై స్కూల్ స్టూడెంట్స్‌కు నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వాలని ఆమె అధికారులకు సూచించారు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో ఏకంగా 24 లక్షల మంది స్టూడెంట్స్‌కు లబ్ధి చేకూరనుంది. స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే టైమ్‌కు పిల్లలకు వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అందజేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యంలో నోటు బుక్స్, టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందించాలని.. పేరెంట్స్‌ను కూడా ఈ కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి సూచించారు.
గవర్నమెంట్ స్కూల్స్‌లోని.. స్టూడెంట్స్ అందరికీ పాఠశాలలు తెరిచే నాటికి రెండు జతల యూనిఫామ్‌లను అందజేయాలని మంత్రి సూచించారు. యునిఫామ్ల కోసం సుమారు రూ.150 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. గత అకడమిక్ ఇయర్ పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.132 కోట్లు ఖర్చు చేయగా.. వచ్చే విద్యా సంవత్సరానికి గాను రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జూన్ 12న పాఠశాలలు స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నందున.. ఆ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక నేతలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఇక ‘మన ఊరు – మన బడి’ పనులను జూన్ తొలి వారంలోగా కంప్లీట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా ఈసారి విద్యార్థుల యూనిఫామ్ కలర్ మారనుంది. రెడ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్‌లో యూనిఫాం ను డిజైన్ చేయిస్తున్నారు. ఇప్పటికే అబ్బాయిలకు, అమ్మాయిలకు వేరు వేరుగా మూడు కేటగిరీల్లో యూనిఫాం డిజైన్ లుక్ విడుదల చేశారు. కార్పొరేట్ స్టైల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ యూనిఫామ్ లుక్ ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..