Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi BRS Office: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ శాశ్వత కార్యాలయ నిర్మణం పూర్తి.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభోత్సం..

ఢిల్లీలో నిర్మించిన BRS నూతన కార్యాలయాన్ని మే 4న సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు.

Delhi BRS Office: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ శాశ్వత కార్యాలయ నిర్మణం పూర్తి.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభోత్సం..
New Brs Office In Delhi
Follow us
Sanjay Kasula

|

Updated on: May 03, 2023 | 6:52 PM

బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి గురువారం దివ్యముహుర్తం. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపు మధ్యాహ్నం ఒంటిగంటా 5 నిముషాలకు ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా.. దేశరాజధాని ఢిల్లీలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. 20వేల చదరపుగజాల్లో 1300 గజాల్లో నిర్మించిన ఐదంతస్థుల భవంతిలో అధ్యక్షుడి గదితో పాటు మరో నలుగురు కార్యదర్శులకు ప్రత్యేక గదులు నిర్మించారు. 40 మందికూర్చునేందుకు వీలుగా కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇది భవనం కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

ఢిల్లీలో నిర్మించిన BRS నూతన కార్యాలయాన్ని మే 4న సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం కేసీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. మే 4న పార్టీ కార్యలయాన్ని ప్రారంభించనున్నట్లుగా కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అప్పటి వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు.

ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్ లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం తొలుత ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని డిసెంబర్ 14న కేసీఆర్ ప్రారంభించారు. ఇది కేవలం ఒక గుర్తింపు కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లు అప్పుడే పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా శాశ్వత భవనం పూర్తి కావడంతో ఎల్లుండి అట్టహాసంగా పార్టీ కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇకపై బీఆర్ఎస్ జాతీయ స్థాయి కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే నడుస్తాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం