Karnataka: గత మూడేన్నరేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు దోచుకున్నారు.. ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. అయితే తాజాగా ఇండిలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. అయితే తాజాగా ఇండిలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో గడిచిన మూడేన్నరేళ్లలో బీజేపీ సర్కార్ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ప్రధానీ మోదీ సైతం ఈ దోపిడిని ఆపేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. వాళ్లు దోచుకున్న సొమ్ముతో 100 ఏఐఎమ్‌ఎమ్ ఆసుపత్రులు, 30 వేల స్మార్ట్ క్లాస్‌రూంలు ఏర్పాటు చేయవచ్చని.. దాదాపు 30 లక్షల పేద ప్రజలకు ఇళ్ళు కట్టించవచ్చని వ్యాఖ్యానించారు.
బీజేపీ నాయకులు కర్ణాటక ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదని.. ప్రతిరోజూ రాష్ట్ర అభివృద్ధికి అవసరం లేని విషయాలను ఎత్తిచూపుతారని విమర్శించారు. రాష్ట్రంలో 40 శాతం కమీషన్ దోపిడీ జరుగుతూంటే ప్రధాని మోదీ ఎందుకు చూడలేకపోతున్నారంటూ చురకలంటించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంపై కూడా ప్రధానీ మౌనం వహిస్తున్నారంటూ ఆరోపించారు.
Karnataka | In the last three and a half years, they (BJP) have looted Rs 1.5 lakh crore from Karnataka. With that money, they could have built 100 AIIMS hospitals, 30,000 smart classrooms and houses for 30 lakh poor people. Today they cannot talk about your issues in front of… pic.twitter.com/v8Buz1TftI
— ANI (@ANI) May 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..