ఓర్నీ చుట్టాలు సల్లగుండా..! పిలవని పెళ్లిలో అతిథుల రచ్చ.. వేడి వేడి పూరీలు పెట్టలేదని రాళ్లదాడి..

ఈ క్రమంలోనే రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు వేడి వేడి పూరీని డిమాండ్ చేశాడు. ఆ టైమ్‌లో పూరీ అందుబాటులో లేకపోవడంతో..హంగామా చేశాడు. బయటి నుంచి తన సహచరులను పిలిపించి పెళ్లింట నానా రచ్చ సృష్టించినట్టుగా పోలీసులు వెల్లడించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

ఓర్నీ చుట్టాలు సల్లగుండా..!  పిలవని పెళ్లిలో అతిథుల రచ్చ.. వేడి వేడి పూరీలు పెట్టలేదని రాళ్లదాడి..
Hot Puris
Follow us
Jyothi Gadda

|

Updated on: May 03, 2023 | 5:10 PM

వివాహ వేడుకకు హాజరైన అతిథులు వేడి వేడి పూరీలు అందలేదని పెళ్లిలో గందరగోళం సృష్టించారు. విడిది ఇంట్లో ఓ యువకుడు రాత్రి రెండు గంటల సమయంలో వేడి వేడి పూరీలు కావాలని డిమాండ్ చేశాడు. వేడివేడి పూరీలు రాకపోవడంతో యువకుడు నానా రచ్చ సృష్టించాడు. స్నేహితులను పిలిచి రాళ్లతో కొట్టించాడు. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే.. ఆ యువకుడు పిలవని పెళ్లికి హాజరైనట్టుగా తెలిసింది. ఈ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వేడివేడి పూరీలు దొరక్కపోవడంతో తోపులాట జరిగింది. దీంతో వివాదం మరింత పెరిగి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

సమాచారం ప్రకారం, గిరిదిహ్‌లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత్రోడి సెంట్రల్ పీఠ్‌లో మంగళవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో కొంతమంది యువకులు రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా రాళ్లదాడికి పాల్పడ్డారు. కర్రలు, పదునైన ఆయుధాలను కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో నలుగురు యువకులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎస్‌డిపిఓ అనిల్ కుమార్ సింగ్, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కమలేష్ పాశ్వాన్, నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆర్‌ఎన్ చౌదరి, ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్ రామ్ కూడా పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకుని, శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లి వేడుకలో భోజనం పెట్టలేదన్న విషయంలో ఉద్దేశపూర్వకంగానే గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న యువకుడు వివాహంలో వివాదం సృష్టించాడు. పాత్రోడిలో శంకర్ అనే వ్యక్తి ఇంటికి వీళ్లంతా భోజనాలకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు భోజనం కోసం అక్కడికి చేరుకుని వేడి వేడి పూరీని డిమాండ్ చేశాడు. ఆ టైమ్‌లో పూరీ అందుబాటులో లేకపోవడంతో..హంగామా చేశాడు. బయటి నుంచి తన సహచరులను పిలిపించి ఆ యువకుడు రచ్చ సృష్టించినట్టుగా పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..