AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story: ముదురుతున్న ‘ది కేరళ స్టోరీ’ వివాదం.. జేఎన్‌యూలో చిత్ర ప్రదర్శన..

'ది కేరళ స్టోరీ' చిత్ర వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటిరే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయ్ విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లాంటి వారు మండిపతున్నారు. కేరళ మత సామస్యరాన్ని దెబ్బతీసేందుకే సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు.

The Kerala Story: ముదురుతున్న 'ది కేరళ స్టోరీ' వివాదం.. జేఎన్‌యూలో చిత్ర ప్రదర్శన..
‘బ్లూ వేల్‌ గేమ్‌’ (బ్లూ వేల్‌ ఛాలెంజ్‌) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో అదా శర్మ పోలీస్‌ పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టును షేర్‌ చేసిందీ అందాల తార.
Aravind B
|

Updated on: May 03, 2023 | 3:27 PM

Share

‘ది కేరళ స్టోరీ’ చిత్ర వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటిరే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయ్ విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లాంటి వారు మండిపతున్నారు. కేరళ మత సామస్యరాన్ని దెబ్బతీసేందుకే సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. అయితే మంగళవారం రోజున ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఈ చిత్రాన్ని విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రదర్శింంచారు. దీనిపై వామపక్ష విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్ఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్ర ప్రదర్శనకు చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, నటీ ఆదా శర్మ కూడా హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మరోవైపు ఈ చిత్రానికి  ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు.. 10 సన్నివేశాలు తొలగించాలంటూ చిత్రబృందానికి సూచించింది.

మరోవైపు ఈ చిత్రం విడుదల చేయకుండా ఆపాలని కోరుతూ కేరళ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇప్పటికే చిత్ర టీజర్‌, ట్రైలర్‌ విడుదలైంది. దీన్ని బట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు అర్థమవుతోందటూ అనూప్‌ వీఆర్‌ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం మే 5కు విచారణను వాయిదా వేసింది. మరో విషయం ఏంటంటే అదే రోజు చిత్రం విడుదల కాబోతోంది.

కేరళ స్టోరీ చిత్రాన్ని థియేటర్లలోనూ, ఓటీటీ వేదికలపై విడుదల చేయకుండా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC)ను ఆదేశించాలా చేయాలంటూ జమైత్‌ ఉలామా-ఇ- హింద్‌ అనే సంఘం సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రం సమాజంలో విభజన తీసుకొచ్చేలా ఉందంటూ ఆరోపించారు. విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోరారు. అలాగే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న చిత్ర ట్రైలర్‌ను కూడా తొలగించాలని పిటిషన్‌లో పేర్కొంది. అయితే అంతకుముందు ఇదే అంశంపై దాఖలైన మరో పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..