AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: తెలంగాణలో బీజేపీ ఓటు షేర్ భారీగా పెరిగింది.. బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 % ఓట్లు సాధిస్తే ఈసారి 35శాతం ఓట్లు గెలుచుకున్నట్లు తెలిపారు సికింద్రబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. గతంలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించుకున్న తెలంగాణ ప్రజలు ఈసారి పార్లమెంట్ లో కూడా 8 సీట్లను అందించారన్నారు. ఎన్నికల్లో గెలుపు తరువాత మొదటి సారి మీడియా సమావేశం ఏర్పటు చేశారు. తెలంగాణలో బీజేపీ సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఓటింగే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీ గణనీయమైన సీట్లు పొందిందని చెప్పారు.

BJP: తెలంగాణలో బీజేపీ ఓటు షేర్ భారీగా పెరిగింది.. బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి..
Union Minister G Kishan Reddy (File Photo)
Srikar T
|

Updated on: Jun 06, 2024 | 1:11 PM

Share

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 % ఓట్లు సాధిస్తే ఈసారి 35శాతం ఓట్లు గెలుచుకున్నట్లు తెలిపారు సికింద్రబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. గతంలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించుకున్న తెలంగాణ ప్రజలు ఈసారి పార్లమెంట్ లో కూడా 8 సీట్లను అందించారన్నారు. ఎన్నికల్లో గెలుపు తరువాత మొదటి సారి మీడియా సమావేశం ఏర్పటు చేశారు. తెలంగాణలో బీజేపీ సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఓటింగే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీ గణనీయమైన సీట్లు పొందిందని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్ల శాతం సాధించినట్లు వివరించారు. మోదీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమన్నారు.

ఐదేండ్లల్లో బీజేపీకి 40 లక్షల ఓట్లు పెరిగాయన్నారు. అదే సమయంలో తమ ఓటు శాతం రెండున్నర రెట్లు పెరిగిందన్నారు. 2014 ఎన్నికల్లో 8.5% తో 20 లక్షల 40 వేల 360 ఓట్లు సాధిస్తే.. 2019 ఎన్నికల్లో 19.65%తో 36 లక్షల 26వేల 173 ఓట్లు సాధించినట్లు తెలిపారు. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 35.08%తో 76లక్షల 47వేల 424 ఓట్లు సాధించామన్నారు. ఐదేండ్లల్లో బీజేపీకి 40 లక్షల ఓట్లు పెరిగాయని గణాంకాలతో వివరించారు. కొత్తగా 14 లక్షల కుటుంబాలకుపైగా ఓటర్లు బీజేపీకి అండగా నిలిచారన్నారు.మరోవైపు బీఆర్ఎస్ తమ ఉనికిని కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్‎కు 14 చోట్ల 3వ స్థానానికే పరిమితమైందని తెలిపారు. 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని.. ఖమ్మం, మహబూబాబాద్ తప్ప మిగిలిన చోట్ల మూడో, నాలుగో స్థానానికి పడిపోయిందని చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాలు గెలిచిన చోట్ల కూడా ఈసారి ఓట్లు తగ్గాయి. ఆయా స్థానాల్లో బీజేపీ పుంజుకుందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం మాత్రమే అన్నారు. విద్యావంతులు, కవులు, ఉద్యమకారుల ఆకాంక్ష కూడా ఇదేనని పేర్కొన్నారు. గత పదేళ్లలో 10 లక్షల కోట్ల నిధులతో తెలంగాణలో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల గెలిస్తే.. మరో 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాంగా నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ కు ప్రత్యమ్నాయం బీజేపీనే అని తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన.. మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ దాదాపు 3.5 లక్షల మెజారిటీతో గెలిచారన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లాలోనూ తమ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారని తెలియజేశారు మాజీమంత్రి, ప్రస్తుత సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..