Schools Reopen in Telangana: తెలంగాణలో నేటి నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
Schools Reopen in Telangana: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా(Corona) ప్రభావంతో మూతపడిన పాఠశాలలను పున:ప్రారంభిస్తున్నట్లు..
Schools Reopen in Telangana: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా(Corona) ప్రభావంతో మూతపడిన పాఠశాలలను పున:ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరుకు విద్యాశాఖలోని అని విభాగాలకు ఆదేశాలను జారీ చేశారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ విద్యాలయాలు తెరవాలని స్కూల్, హైయర్ ఎడ్యూకేషన్ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ కారణంగా మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. సంక్రాంతికి ఇచ్చిన సెలవులను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ఈనెల 30 వరకు పొడిగించారు. ఇక సెలవులు ముగుస్తుండటంతో ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడం, అక్కడ విద్యార్థులపై కరోనా ప్రభావం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తక్కువగా ఉందన్న వైద్యఆరోగ్య శాఖ సూచనలతో పాఠశాలలు రీ ఓపెనింగ్ సరైన సమయంగా విద్యాశాఖ భావించింది. విద్యా సంస్థల్లో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యశాఖకు సూచించింది. ఇక విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. పాఠశాలల్లో శానిటైజేషన్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో టీవీ, ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు మాత్రమే టీ శాట్, దూరదర్శన్, వాట్సప్ తో ఆన్ లైన్ బోధన జరిగింది. ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వాదనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇప్పటికే ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. అయితే మరిన్ని కొన్ని రోజులు సెలవులు కొనసాగితే సిలబస్ పూర్తి చేయడం కష్టతరం అవుతుందని..దాని ప్రభావం వార్షిక పరీక్షలపై పడుతుందని పలు సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికితీసుకొచ్చాయి. తాజాగా విద్యాసంవత్సరాన్ని పొడిగించాలన్న విజ్ఞప్తిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలను మే నెలలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మే 30 వరకు విద్యాసంవత్సరాన్ని పొడిగిస్తారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి: