One Ddigital ID: మరో కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. గుర్తింపు పత్రాలన్నీ అనుసంధానం చేస్తూ ఒకే డిజిటల్ ఐడీ..!
One Ddigital ID: ఇక ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ (Aadhaar), పాన్‌కార్డు (PAN Card), డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence), పాస్‌పోర్ట్ (Passport). ఏ పనులు చేసుకోవాలన్నా..
One Ddigital ID: ఇక ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ (Aadhaar), పాన్‌కార్డు (PAN Card), డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence), పాస్‌పోర్ట్ (Passport). ఏ పనులు చేసుకోవాలన్నా ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి. ప్రభుత్వ పథకాల నుంచి చిన్న చిన్న పనులకు తప్పనిసరి కావాల్సిందే. ఇక ఆధార్, పాన్ కార్డులు బ్యాంకుకు సంబంధించి పనుల నుంచి చిన్నపాటి పనులకు తప్పనిసరి కావాల్సిందే. కొన్ని పనులు కావాలంటే ఇందులో ఆధార్‌తో పాటు ఏదైనా డాక్యుమెంట్ తప్పనిసరి అవుతుంది. ఇలాంటి డాక్యుమెంట్లన్నీ ఐడీ (ID)లుగా అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఒకే డిజిటల్ ఐడీ’ (One Ddigital ID)ని రూపొందించేందుకు కేంద్ర సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ (Digital) గర్తింపు పత్రాలను ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ (Federated Digital Identities)గా ఈ కొత్త మోడల్‌ను రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ( Ministry of Electronics and Information Technology) ఓ ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలో భాగంగా ఆధార్ కార్డు నంబర్ మాదిరిగానే దీనికి కూడా ముఖ్యమైన గుర్తింపు ఉండవచ్చని అంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించకోవడానికి వీలుగా ఈ ప్రతిపాదనను రూపొదించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారాన్ని మొత్తాన్ని ఒకే చోట ఉంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది నో యువర్ కస్టమర్ (KYC) లేదా ఈ-కేవైసీకి ఈ డిజిటల్ ఐడీని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం దేశ పౌరులు వివిధ అవసరాల కోసం ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటివాటిని ప్రభుత్వ గుర్తింపు కార్డులుగా వాడుతున్నారు. వీటన్నింటి స్థానంలో ఒకే డిజిటల్ ఐడీ ఉండటం మేలని కేంద్ర ప్రభుత్వం (Central Government) భావిస్తోంది. అయితే కొత్తగా తీసుకువస్తున్న ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం, సెక్యూరిటీ చర్యల తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన నేపథ్యంలో త్వరలో ప్రజాభిప్రాయానికి కేంద్ర ఐటీ శాఖ (ID Department) అందుబాటులో ఉంచుతుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: