AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio 5G speed: జియో 5జీ టెస్ట్‌ వివరాలు లీక్‌.. నిమిషంలోనే సినిమా డౌన్‌లోడ్‌.. 4G కంటే 8 రేట్లు ఎక్కువ స్పీడ్‌..!

Jio 5G speed: టెలికాం రంగంలో జియో దూసుకుపోతోంది. ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే..

Jio 5G speed: జియో 5జీ టెస్ట్‌ వివరాలు లీక్‌.. నిమిషంలోనే సినిమా డౌన్‌లోడ్‌.. 4G కంటే 8 రేట్లు ఎక్కువ స్పీడ్‌..!
Subhash Goud
|

Updated on: Jan 30, 2022 | 6:45 AM

Share

Jio 5G speed: టెలికాం రంగంలో జియో దూసుకుపోతోంది. ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ 5జీకి సంబంధించి సేవల పనులు వేగవంతం అవుతున్నాయి. ముందుగా దేశంలోని 13 మెట్రో నగరాల్లో 5జీ సేవలు మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్) ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత వ్యాప్తంగా ఇంటర్నెట్ విషయంలో సంచలనాలు క్రియేట్ చేసిన జియో.. 5G రేసులో ముందు వరసలో కనిపిస్తోంది. 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కస్టమర్లకు అందించాలని దేశంలోని 1000 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అందించేందుకు ప్లాన్‌ కూడా సిద్ధం చేసింది రిలయన్స్‌ జియో.

ఇక 5జీ ట్రయల్స్‌ నిర్వహించింది సంస్థ.. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఓ స్క్రీన్‌షాట్‌ మాత్రం లీక్ అయ్యింది. లీకైన సమాచరం ప్రకారం చూస్తే.. 4జీ నెట్‌వర్క్ కంటే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడ్ 8రెట్లు వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. 420Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో.. 412Mbps అప్‌లోడ్ స్పీడ్‌ జీయో నెట్‌‍వర్క్‌లో ఉంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఇది 15రెట్లు అధికం కాగా.. ఈ స్పీడ్‌తో కేవలం ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నగరాల వారీగా..

ఇక ముంబై నగరంలో జియో 5జీ నెట్‌వర్క్ పరీక్షలు జరిగాయి. జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 46.82ఎంబీపీఎస్, అప్‌లోడ్ స్పీడ్ 25.31ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ డేటాతో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ 8రెట్లు, అప్‌లోడ్ 15 రెట్లు వేగంగా ఉంది. అయితే, ట్రయల్స్‌ సమయంలో వచ్చిన ఫలితాలకు వాస్తవ రూపంలో వాడకంలోకి వచ్చే వేగంలో మార్పులు ఉంటాయి. గతంలో 4జీ విషయంలో కూడా అదే జరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, గురుగ్రామ్, చండీగఢ్, బెంగుళూరు, అహ్మదాబాద్, జామ్‌నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, గాంధీనగర్‌లతో సహా కొన్ని నగరాల్లో 5G విడుదల జరుగుతుందని డాట్‌ (DoT) ఇప్పటికే ధృవీకరించింది.

ఇవి కూడా చదవండి:

Railway Track Facts: రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి కారణం ఏమిటి..?

Color Identify: పురుషుల కంటే మహిళలే ఎక్కువ రంగులను గుర్తిస్తారట.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!