Budget 2022: బడ్జెట్‌లో వాహనదారులకు శుభవార్త అందనుందా..? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది
Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget-2022) కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ కోసం..
Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget-2022) కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ కోసం పార్లమెంట్ సమావేశాలు ఈరోజు (జనవరి 31) ప్రారంభం అయ్యాయి. నేడు బడ్జెట్ ను దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టనున్నారు. వరుసగా నాలుగోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ముఖ్యంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర సర్కార్ గత ఏడాది నవంబర్‌లో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఇక కరోనా మహమ్మారి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదాయం భారీగా పెరిగింది. అయితే అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. దీంతో సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ భాస్కర్ నివేదిక అంచనా వేస్తోంది.
అయితే బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు అందించే అవకాశాలున్నాయని మరికొంత మంది నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ సుంకాలను తగ్గించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ నిర్ణయం తీసుకుం వాహనదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే మోడీ సర్కార్ ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి: