Economic Survey 2022: దేశంలో విద్యుత్, రవాణా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయంటే.. ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే..

ఎకనామిక్ సర్వే 2021-2022 దేశవ్యాప్తంగా విద్యుత్, రవాణా మౌలిక సదుపాయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవి ఏమింటే..

Economic Survey 2022: దేశంలో విద్యుత్, రవాణా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయంటే.. ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే..
Economy
Follow us
Srinivas Chekkilla

| Edited By: Team Veegam

Updated on: Jan 31, 2022 | 8:59 PM

ఎకనామిక్ సర్వే 2021-2022 దేశవ్యాప్తంగా విద్యుత్, రవాణా మౌలిక సదుపాయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవి ఏమింటే..

విమానాశ్రయాలు

నవంబర్ 2016 నాటికి భారతదేశంలో 62 విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి UDAN అనే పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం క్రియాశీల విమానాశ్రయాల సంఖ్య 130గా ఉందని ప్రభుత్వం తెలిపింది.

బ్యాంకులు

ప్రభుత్వ డేటా ప్రకారం, బ్యాంకింగ్ బ్రాంచ్ నెట్‌వర్క్ కూడా గత దశాబ్దంలో పెద్ద ఎత్తున పెరిగింది. భారతదేశంలోని వాణిజ్య బ్యాంకు శాఖల సంఖ్య మార్చి 2011లో 74,130, 2021-22 ఆర్థిక సర్వేలో ప్రచురించిన డేటా ప్రకారం మార్చి 2021 చివరి నాటికి 1.22 లక్షలకు చేరుకుంది. బ్యాంకు శాఖలలో అరవై శాతానికి పైగా వృద్ధిని సాధించాయి.

పునరుత్పాదక శక్తిలో అభివృద్ధి

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుత్పాదక ఇంధనం ప్రాధాన్యత జాబితాలో చేర్చారు. ప్రభుత్వ డేటా ప్రకారం, దేశం సౌర శక్తి సామర్థ్యం 2014లో దాదాపు 2632 మెగావాట్ల ఉండగా 2021 నాటికి 40,000 మెగావాట్లకు పెరిగింది. గుజరాత్‌లోని ఉపగ్రహ చిత్రాలు ఈ ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ల వేగవంతమైన అభివృద్ధిని చూపుతున్నాయి. అత్యధిక సౌర విద్యుత్ సామర్థ్యం కలిగిన రాష్ట్రాల జాబితాలో గుజరాత్ (4430 మెగావాట్లు) మూడో స్థానంలో ఉంది. సౌర వ్యవస్థాపిత సామర్థ్యంలో మొదటి రెండు రాష్ట్రాలు కర్ణాటక (7355 మెగావాట్లు), రాజస్థాన్ (5732 మెగావాట్లు) ఉన్నాయి.

ప్రధాన్ మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన – సౌభాగ్యను అక్టోబర్ 2017లో ప్రారంభించింది. అన్ని గ్రామీణ, పట్టణల్లో విద్యుత్ లేని గృహాలకు విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు. అప్పటి నుండి 2.81 కోట్ల గృహాలకు విద్యుద్దీకరణ జరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ నివేదించింది.

నేషనల్ హైవే నెట్‌వర్క్

ఎకనామిక్ సర్వే 2021-22 ప్రకారం ఆగస్టు 2011లో భారతదేశం అంతటా జాతీయ రహదారులు దాదాపు 71,772 కిలోమీటర్లకు విస్తరించాయి. అదే రోడ్ నెట్‌వర్క్ వచ్చే పదేళ్లలో దాదాపు రెండింతలు పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం జాతీయ రహదారుల నెట్‌వర్క్ దాదాపు 1.40 లక్షల కిలోమీటర్లుగా ఉంది.

వ్యవసాయం

నికర విత్తిన ప్రాంతం లేదా వ్యవసాయ పంటల విస్తీర్ణం కూడా భారీగా పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. 2005-06లో దాదాపు 127 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా 2020-21లో 156 మిలియన్ హెక్టార్లకు పెరిగింది.

Read Also.. Budget 2022: ఆర్ధిక సర్వే ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఆర్థిక సర్వే అంటే ఏమిటో తెలుసా?