Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాఠశాలలకు వరుస సెలవులు
Telangana School Holidays: తెలంగాణలో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం సెలవును ప్రకటించింది. వరుస సెలవులు వస్తుండటంతో విద్యార్థుల్లో ఆనందం ఉప్పొంగిపోతోంది. మరి ఏయే రోజుల్లో సెలవులు రానున్నాయి? ఎందుకు పాఠశాలలు మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం.. అలాగే..

విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరి గంతులేస్తారు. విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత పెద్దగా సెలవులు లేవు. కానీ ఇప్పుడు తెలంగాణలో వరుసగా సెలవులు రానున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలకు జులై 19 నుండి 21 వరకు మూడు రోజుల పాటు వరుస సెలవులు రానున్నాయి. జూలై 19వ తేదీన చాలా పాఠశాలలకు హాఫ్ డే, 20న ఆదివారం సెలవు కాగా, జూలై 21న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్ధులు 19న ఆఫ్‌డే కాబట్టి ఆ రోజు కూడా వెళ్లకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.
బోనాల వేడుకల కారణంగా సెలవులు:
తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్‌లో ఆషాడ మాసం మొత్తం ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే జూన్ 26న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం కాగా, జూలై 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా బోనాల జాతర జరిగిన విషయం తెలిసిందే. ఇక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనం జూలై 20న జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




