Armed Forces Flag Day: అమరజవాన్ల ఫ్యామిలీలకు అండగా ఎస్బిఐ.. గవర్నర్ తమిళసై కు భారీ విరాళం అందజేత
Armed Forces Flag Day: ప్రగతిశీల ప్రపంచంలో మహిళా సాధికారతకు అందరూ సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ (Telangana) రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan)అన్నారు. పోటీ ప్రపంచంలో..
Armed Forces Flag Day: ప్రగతిశీల ప్రపంచంలో మహిళా సాధికారతకు అందరూ సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ(Telangana) రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan)అన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలకు సామాజిక-ఆర్థిక స్థిరత్వం పెరగాలంటే కేవలం స్వచ్ఛంద సంస్థలే కాకుండా బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాజీ సైనికులు, యుద్ధ వితంతువులపై ఆధారపడిన ఆడపిల్లల సంక్షేమం కోసం SBI హైదరాబాద్ సర్కిల్ అందించిన 17 లక్షల 12 వేల 2వందల చెక్కును గవర్నర్ తమిళిసై అందుకున్నారు. “సాయుధ దళాల జెండా దినోత్సవం” జ్ఞాపకార్థం సిబ్బంది జమచేసిన మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్, సిబ్బంది రాజభవన్ లో గవర్నర్ తమిళిసై ను కలిసి చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఒక లక్ష్యం కోసం 2016 సంవత్సరం నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్న SBI సిబ్బంది స్వచ్ఛందంగా సేకరిస్తున్నట్లు చెప్పారు.
స్వాతంత్యం వచ్చిన వెంటనే, ప్రభుత్వం సైనికుల కుటుంబాల అవసరాలను తీర్చాలని భావించింది. 7 డిసెంబర్ 1949 న “సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలు ట్టి.. నేటికీ ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దేశ గౌరవాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడిన భారత సైనికులను సన్మానించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, సైనికుల జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము.