AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్, శరన్‌ల వివాదానికి ఎండ్ కార్డు.. అకౌంట్స్ సెటిల్ చేసుకున్నామన్న శరన్

Bellamkonda Suresh: గత కొద్ది రోజులుగా ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కి , ఫైనాన్షియర్ శరన్(Sharana) కి మధ్య జరుగుతున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఆర్థికపరమైన లావాదేవీల్లో చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల ఇబ్బంది..

Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్, శరన్‌ల వివాదానికి ఎండ్ కార్డు.. అకౌంట్స్ సెటిల్ చేసుకున్నామన్న శరన్
Bellamkonda Suresh Sharan
Surya Kala
|

Updated on: Mar 16, 2022 | 3:39 PM

Share

Bellamkonda Suresh: గత కొద్ది రోజులుగా ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కి , ఫైనాన్షియర్ శరన్(Sharana) కి మధ్య జరుగుతున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఆర్థికపరమైన లావాదేవీల్లో చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల ఇబ్బంది ఏర్పడిందని కంప్లైంట్ ఇచ్చిన శరన్ అన్నాడు. మధ్యవర్తుల తో మాట్లాడి అకౌంట్స్ సెటిల్ చేసుకున్నాం అని అందుకే కేసును విత్ డ్రా చేసుకుంటున్నాను అని శరన్ చెప్పాడు.

అయితే గత కొన్ని రోజుల క్రితం సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలామందిని చీట్ చేశాడు, నన్ను అలాగే చీట్ చేశాడని అతనికి డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్ శరణ్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు బెల్లంకొండ సురేష్ తో పాటు.. అతని కొడుకు సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కూడా పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

రెండు సంవత్సరాలుగా బెల్లంకొండ సురేష్ ను డబ్బులు అడుగుతుంటే కాలయాపన చేశాడు… పైగా నన్ను చంపుతా అని బెదిరిస్తున్నాడు శరన్ చెప్పాడు. ఇక సురేష్ కూడా శరన్ పై తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డాడు. తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో.. దీనివెనుక ఎవరు ఉన్నారో ఆయనకు తెలుసు అని బెల్లంకొండ సురేష్ చెప్పాడు. అయితే ప్రస్తుతం  వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదం ఎండ్ కార్డు పడింది.

Also Read:

Hyderabad: ప్రముఖ సింగర్ బలవన్మరణం.. ఉరివేసుకొని ఆత్మహత్య..

Nara Lokesh: ఏపీలో కొనసాగుతున్న సారాయి రగడ.. సీఎం రాజీనామా చేయాలని లోకేష్ డిమాండ్

 సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్