గుట్టుగా దాటేద్దామనుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు.. గంజాయి ఎలా దాచారో తెలిస్తే అవాకవ్వాల్సిందే!
రోజురోజుకు గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అడ్డుఅదుపూ లేకుండా ఇష్టానుసారంగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా ఇలానే సుమారు 123 కిలో గంజాయిని కార్లలో క్యాబిన్లలో దాచి తీసుకెళ్తూ సంగారెడ్డి పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు స్మగ్లర్లు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి రవాణాకి కాదేది అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు స్మగ్లర్లు. ఎప్పుడు, ఎక్కడ చూడని విధంగా ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని దర్జాగా మన తెలుగు రాష్ట్రాల్లోకి సినిమా తరహాలో అక్రమంగా తరలిస్తున్నారు. వాటిని ఇక్కడ విక్రయిస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. వీటిపై దృష్టి పెట్టిన పోలీసులు.. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒరిస్సా నుంచి సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రకు పెద్ద ఎత్తున్న గంజాయి తరలిస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి భారీ మొత్తం గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకి వెళ్తున్న రెండు ఇండికా కార్లను.. సంగారెడ్డి జిల్లా చేర్యాల ఫ్లై ఓవర్ వద్ద NH 161 పై పోలీసులు అడ్డగించారు. అనుమానం వచ్చిన వాళ్ల వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే వాహనాలలో ప్రత్యేక క్యాబిన్ లు ఏర్పాటు చేసి గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అబ్దుల్ వాహబ్, ఉమాకాంత్ సబర్‌గా గుర్తించారు.
నిందితుల నుంచి సుమారు 123 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు వారు ప్రయాణిస్తున్న రెండు కార్లను సీజ్ చేసి నిందితులతో పాటు వాటిని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ. 49 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.జిల్లాలో గడిచిన 6 నెలల్లో 80 గంజాయి కేసులు నమోదయినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




