Viral Video: దేఖో మై రౌడీయిజం.. కుక్కకు చుక్కలు చూపించిన కోతి!.. వీడియో చూస్తే.. నవ్వాపుకోలేరు!
సహజంగా వీధి కుక్కలను చూసి వానరాలు భయపడుతాయి. కుక్క అరిచిన శబ్దం వినిపించినా అక్కడి నుండి పరుగో పరుగని పరుగులు పెడతాయి. కానీ ఇక్కడ మాత్రం దానికి బిన్నంగా ఓ విచిత్ర సీన్ జరిగింది. ఓ కోతి కుక్కకు చుక్కలు చూపించింది. కుక్క వీపు పైకి ఎక్కి కూర్చున్న కోతి దేకో మై రౌడీయిజం అన్నట్లుగా వీధికుక్కను పరేషాన్ చేసింది.. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు .

సహజంగా వీధి కుక్కలను చూసి వానరాలు భయపడుతాయి. కుక్క అరిచిన శబ్దం వినిపించినా అక్కడి నుండి పరుగో పరుగని పరుగులు పెడతాయి. కానీ ఇక్కడ మాత్రం దానికి బిన్నంగా ఓ విచిత్ర సీన్ జరిగింది. ఓ కోతి కుక్కకు చుక్కలు చూపించింది. కుక్క వీపు పైకి ఎక్కి కూర్చున్న కోతి దేకో మై రౌడీయిజం అన్నట్లుగా వీధికుక్కను పరేషాన్ చేసింది.. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు .ఈ విచిత్ర సన్నివేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన వానరాలు అక్కడ నిద్రిస్తున్న కుక్కను లేపి మరి ఎగిరితన్నాయి.. అంతటితో ఆగలేదు.. ఆ కుక్క వీపుపైకి ఎక్కి కూర్చొని ఆట పట్టించాయి.
ఓ కోతి వీధికుక్క వీపుపైకి ఎక్కి కూర్చొని పరేషాన్ చేస్తే మరో కోతి.. ఆ కుక్కను గెలుకుతూ దేకోమై రౌడీయిజం అన్నట్లుగా ఆ వీధి కుక్కను పరేషాన్ చేశాయి.. వీధి కుక్క, కోతి విచిత్ర సన్నివేశాన్ని చూసిన అక్కడున్న భక్తులు స్థానికులు అంతా షాక్ అయ్యారు.. కొంతమంది ఈ సీన్ అంత సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో చూడండి…
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
