AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sand Mafia: ములుగు జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. చోద్యం చూస్తున్న రెవెన్యూ, TSMDC అధికారులు

ములుగు జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు..

Sand Mafia: ములుగు జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. చోద్యం చూస్తున్న రెవెన్యూ, TSMDC అధికారులు
Sand Mafia
Sanjay Kasula
|

Updated on: May 03, 2022 | 11:26 PM

Share

ములుగు జిల్లాలో స్యాండ్‌ మాఫియా(Mulugu sand mafia)బరితెగిస్తోంది. పట్టాభూముల్లో తవ్వకాల పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతూ కోట్లు సంపాదిస్తోంది. ఇసుక తవ్వకాలను అరికట్టాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అడ్డుకోవాల్సినవారే సహకరిస్తుండడంతో మాఫియా మరింతగా చెలరేగిపోతోంది. ఏటూరునాగారం శివారు దెయ్యాల వాగులో ఏకంగా ఇసుక క్వారీనే ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. గోదావరి వరద ముప్పు నుంచి గ్రామరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టనూ వదలకుండా భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తతంగమంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా అడ్డుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇసుకను ఇష్టానుసారంగా తవ్వడం వల్ల భూగర్భజలాలు అడుగంటుతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అక్రమార్కుల తవ్వకాలతో కరకట్ట తెగే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. అదే జరిగితే గోదావరి వరద గ్రామాలను ముంచడం ఖాయమంటున్నారు.

కరకట్ట వద్ద ఇసుక తవ్వకాలపై ఆందోళనకు చేసినా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు గ్రామస్థులు. మామూళ్ల మత్తులో ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఇసుక తవ్వకాలను నిలిపి భూగర్భజలాలను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!