Hyderabad: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతి అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్(Betting).. ఎందరో జీవితాలను తలకిందులు చేస్తున్న వ్యసనం. సరాదాగా ప్రారంభమై చివవరకు అప్పుల ఊబిలో నెట్టేస్తున్న ఈ మహమ్మారి ఎందరినో చిత్తు చేసింది. ఇలా యువకులనే లక్ష్యంగా...
క్రికెట్ బెట్టింగ్(Betting).. ఎందరో జీవితాలను తలకిందులు చేస్తున్న వ్యసనం. సరాదాగా ప్రారంభమై చివవరకు అప్పుల ఊబిలో నెట్టేస్తున్న ఈ మహమ్మారి ఎందరినో చిత్తు చేసింది. ఇలా యువకులనే లక్ష్యంగా చేసుకుని కోట్లు కూడబెట్టుకున్న బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతిని హైదరాబాద్(Hyderabad) పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతి అరెస్ట్ అయ్యాడు. అతనితో పాటు మరో 20 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మారియట్ హోటల్ లో హై-టెక్ క్యాసినో నిర్విహిస్తూ అమిత్ పోలీసులకు దొరికాడు. గతంలో రెండు సార్లు పోలీసులు ఆమిత్ ను అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్ పై అమిత్ గుజరాతి ను పోలీసులు హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అమిత్.. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని అమిత్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నాడు. కొన్నేళ్లుగా బెట్టింగులు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో పోలీసులు అమిత్ ను పట్టుకున్నారు. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Viral Photo: తోపుడు బండి దగ్గర టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వరుడిని గుర్తుపట్టారా.? ఈజీగా కనిపెట్టొచ్చు