TSRTC: ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ సరికొత్త ప్రయత్నం.. ఆ దుకాణాలపై 30శాతం రాయితీ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ(TSRTC)ని లాభాల బాట పట్టించేందుకు సంస్థ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల రాయితీలు ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు...
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ(TSRTC)ని లాభాల బాట పట్టించేందుకు సంస్థ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల రాయితీలు ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని అతిపెద్ద బస్టాండ్ అయిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(MGBS) ప్రాంగణాన్ని వ్యాపార సముదాయాల కోసం వినియోగించుకోవాలని భావిస్తోంది. బస్టాండ్ లో ఉన్న 108 దుకాణాల్లో 23ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా అయితే వీటిని దక్కించుకోవాలంటే టెండర్ విధానంలో పోటీ పడాలి. కానీ యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు అక్కడి దుకాణాల అద్దెలపై 30 శాతం రాయితీ ప్రకటించింది. గతంలో అద్దెలు ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు దుకాణాలను మెయింటేన్ చేయలకే ఖాళీ చేసేవారు. ఇలా ఖాళీగా ఉండటంతో నెలకు దాదాపు రూ.23 లక్షలు ఆదాయాన్ని సంస్థ కోల్పోతోంది. ఇప్పుడు 30 శాతం రాయితీలో ఈ నష్టాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.
మరోవైపు పాస్ లపై రాయితీ ప్రకటించింది. ట్రావెల్ యాజ్ యూ లైక్ రూ.100 పాస్ రోజువారి ప్రయాణం కోసం తీసుకుంటారు. ఈ పాస్‌లు గతంలో కేవలం 4 వేలు వరకు మాత్రమే అమ్ముడయ్యేవి. ఈ టిక్కెట్లపై 20 శాతం రాయితీ ఇవ్వడంతో ఒక్కసారిగా అమ్మకాలు 12 వేలకు పెరిగాయి. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రకటించిన ఈ రాయితీని మరో నెల రోజులు కొనసాగించారు. ఇప్పుడు ఇంధన ధరలు పెరగడంతో రాయితీ లేకున్నా రోజూ 12 వేల నుంచి 14 వేల పాస్‌లు అమ్ముడవుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి