AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Drink: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా.. బరువు తగ్గేందుకు ఈ స్పెషల్ హోమ్‌మేడ్ డ్రింక్‌‌ను ఎలా చేసుకోవాలో తెలుసా..

డయాబెటిస్​ రోగులైనా మరెవరైనా ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అందుకే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పక తీసుకోవాలి. అయితే ఎవరు ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవడం..

Weight Loss Drink: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారా.. బరువు తగ్గేందుకు ఈ స్పెషల్ హోమ్‌మేడ్ డ్రింక్‌‌ను ఎలా చేసుకోవాలో తెలుసా..
Weight Loss Drink
Sanjay Kasula
|

Updated on: May 03, 2022 | 8:56 PM

Share

డయాబెటిస్​ రోగులైనా మరెవరైనా ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అందుకే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పక తీసుకోవాలి. అయితే ఎవరు ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవడం మంచిది అనేది చాలా ముఖ్యం. స్థూలకాయం ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దేశంలోని ప్రతి నాల్గవ వ్యక్తిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో పెరిగిన బరువు మీ వ్యక్తిత్వాన్ని పాడుచేయడమే కాకుండా మీరు బ్లడ్ షుగర్, రక్తపోటు, గుండెపోటు మొదలైన అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడవచ్చు. అందుకే సకాలంలో బరువు తగ్గడం చాలా ముఖ్యం.

అటువంటి పరిస్థితిలో మీరు బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోవల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపుడుకునేందుకు దాల్చినచెక్క, తేనె వంటి వాటిని నిత్యం తీసుకోవడం చాలా అవసరం. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు త్వరగా బరువు తగ్గవచ్చు. దీనితో పాటు, దాని వినియోగం ద్వారా శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఈ హోంమేడ్ డ్రింక్ ఎలా తీసుకోవాలి.. అలాగే దీన్ని ఎలా తయారు చేయాలో ఓసారి తెలుసుకుందాం. 

బరువు తగ్గడానికి ఇంట్లో తయారుచేసిన డ్రింక్ ఎలా తయారు చేయాలి..

కావల్సిన పదార్థాలు..

  • దాల్చిన చెక్క – 3-6 గ్రాములు 
  • నీరు – 2 కప్పులు 
  • తేనె – 1 స్పూన్ 

ఇంట్లో తయారుచేసిన డ్రింక్

  • వెయిట్‌లాస్ హోమ్‌మేడ్ డ్రింక్ చేయడానికి ముందుగా పాన్‌లో నీటిని మరిగించండి. 
  • నీరు మరుగుతున్న సమయంలో దాల్చిన చెక్కను అందులో వేయండి.
  • ఇప్పుడు తక్కువ మంట మీద వేడి చేయండి. 
  • ఆ తర్వాత వడగట్టి అందులో తేనె మిక్స్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చగా తాగాలి.

ఎలా నిత్యం చేయడం వల్ల మీరు బరువు తగ్గే అకాశం ఉంది. బరువు తగ్గితే చాలా సమస్యలకు చెక్ పడినట్లే. దాల్చిన చెక్కలో యాంటీ ఒబెసోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది. దీని కారణంగా, బరువు తగ్గడమే కాకుండా రక్తపోటు, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ఇక తేనెలో కేలరీలు చాలా తక్కువ. దీనితో పాటు ఫ్రక్టోజ్ ఇందులో దొరుకుతుంది. ఇది బరువును తగ్గించడంలో.. శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?