Stress: ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే లక్షణాలు.. దీని నుంచి బయట పడటం ఎలా..?

Stress: చాలా మందికి ఒత్తిడి అనేది తీవ్ర సమస్యగా మారుతోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురవడం వల్ల అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ..

Stress: ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే లక్షణాలు.. దీని నుంచి బయట పడటం ఎలా..?
Follow us
Subhash Goud

|

Updated on: May 03, 2022 | 8:00 PM

Stress: చాలా మందికి ఒత్తిడి అనేది తీవ్ర సమస్యగా మారుతోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురవడం వల్ల అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడికిలోనైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. అందుకే రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇక ఒత్తిడికి లోనైనపుడు కనిపించే పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆందోళనగా కనిపించడం, ఒళ్ళంతా చెమట పట్టడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, నోరు పొడిబారినట్లు అవడం, గుండెదడ వంటి లక్షణాలతో పాటు మానసిక ఒత్తిడి, అధికంగా ఆందోళన చెందడం, ఏ పనిమీద సరిగా దృష్టి పెట్టలేకపోవడం, ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.

ఒత్తిడిని జయించేందుకు కొన్ని చిట్కాలు:

  1. కంటి నిండా నిద్ర ఉంటే ఆ వ్యక్తులకు ఒత్తిడిని సులువుగా జయిస్తారని చెప్పవచ్చు. రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తే మానసిక ప్రశాంతత దొరుకుంది.
  2. సమయానికి ఆహారం తీసుకోవడం: ఆహారాన్ని సమయానికి తీసుకుంటే పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది. మీ ఫలితాలు పాజిటివ్‌గా ఉంటాయి. ఆరోగ్యకరమైన, రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. చక్కెర, కార్బొహైడ్రేట్లను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
  3. మద్యానికి దూరంగా ఉండడం: చెడు అలవాటు అని తెలిసినా మద్యాన్ని మానేయలేరు. కానీ మద్యం సేవించిన తర్వాత కోపం పెరిగి ఇతరులతో గొడవ పడటం, కోపాన్ని ప్రదర్శించడం చేస్తారు. దీని వల్ల కొన్ని బంధాలు కోల్పోతారు. సాధ్యమైనంతవరకు మద్యం తీసుకోవడం తగ్గించడం మంచిది. మద్యం సేవిండం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి.. వైరస్ బారినపడే అవకాశాలు పెరుగుతాయి.
  4. వ్యాయామం లేదా యోగా: ప్రతిరోజూ ఉదయం యోగా లేక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గాలి అంటే వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ తప్పక చెయ్యాలి. కనీసం రోజుకు 45 నిమిషాల పాటు ఈ వ్యాయామలు చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయ పడుతుంది.
  5. వదంతులకు దూరంగా ఉండడం: మీ చుట్టు అది జరిగింది, వాళ్లు ఇలా, వీళ్లు ఇలా చేశారంటూ పొరుగువారు మీతో డిస్కషన్ కు వస్తే అక్కడే ఆపేయండి. వీటి బదులు మీరు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మీ పనులు సులువుగా పూర్తిచేసే అవకాశాలుంటాయి.
  6. మానసిక ఒత్తిడికి గురైనపుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్తూ సరైన రీతిలో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వీవీవిలలో మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాలు చూడడం మంచిది. భయాందోళనకు గురిచేసే సినిమాలు, ప్రోగ్రామ్స్ చూడవద్దు. వీలైతే ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
  7. ఆహ్లాదానిచ్చే సినిమాలు చూడడం, ఇంట్లోనే ఉంటూ బంధువులు, స్నేహితులతో మాట్లాడడం, పజిల్స్ సాధించడం, స్టోరీబుక్స్ చదవుతూ ఉండాలి.
  8. వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి.
  9. మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

World Asthma Day 2022: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ఆస్తమా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

Health Tips: మీ అరచేతులు, అరికాళ్లు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? హైపర్‌ హైడ్రోసిస్‌ కావచ్చు.. జాగ్రత్త..!

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే