AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Asthma Day 2022: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ఆస్తమా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

World Asthma Day 2022: ప్రస్తుతం వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. తినే ఆహారం, జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు...

World Asthma Day 2022: ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ఆస్తమా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు
World Asthma Day 2022
Subhash Goud
|

Updated on: May 03, 2022 | 6:47 PM

Share

World Asthma Day 2022: ప్రస్తుతం వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. తినే ఆహారం, జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక మనిషిని మరింతగా ఇబ్బందుల్లో నెట్టేసే వ్యాధుల్లో ‘అస్తమా’ (Asthma) ఒకటి. దీనిని ఉబ్బసం అని కూడా ఉంటుంటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అస్తమాతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మే 3వ తేదీన ప్రపంచ ఆస్తమా దినోత్సవం జరుపుకొంటారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య 400 మిలియన్ల మార్కును దాటుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు ఆడమ్ జి, రెబెక్కా హెచ్, లిండా ఎన్ పేర్కొంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఉబ్బసం తీవ్రతరం రాత్రి లేదా తెల్లవారుజాము ప్రాంతంలో తీవ్ర ప్రభావం ఉంటుంది. దీని వల్ల నిద్ర (Sleep)కు భంగం కలుగుతుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.

తరచూగా రాత్రి సమయాల్లో మేల్కొనడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీర్ఘాకాలంలో శక్తిని కోల్పోవాల్సి ఉంటుంది. అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. వాతావరణం మార్పుల కారణంగా ఆస్తమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రోగి ఆందోళనకు గురవడంతో దాని ప్రభావం మరింతగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అస్తమా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల తీవ్ర నిరాశకు, కోపానికి గురవుతుంటారు. తనపై తాను నియంత్రణ కోల్పోతాడు. చికాకు ఉంటుంది.

అధిక శ్రమ:

ఆస్తమా ఉన్నవాళ్లు శరీర ఉష్ణోగ్రతలు, అధిక శ్రమ, వ్యాయమాల కారణంగా ఎక్కువగా అలసిపోతుంటారు. ఇక భారత దేశంలో 1.31 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. వీరిలో 6 శాతం మంది పిల్లలు ఉన్నారు. ఆస్తమా శ్వాసకోశ వ్యాధి. ఊపిరితిత్తులకు ప్రాణవాయువును చేరవేసే శ్వాస నాళాల్లో వాపు రావడం, అక్కడ ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి కావడం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది. అలాగే గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బంది అవుతుంది. కొద్దిసేపు నడిచినా.. ఏదైనా చిన్నపాటి పని చేసినా ఆయాసం వచ్చేస్తుంటుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంటుంది.

ఆస్తమా రావడానికి కారణాలు ఏమిటి?

అయితే చెడు ఆహారపు అలవాట్లు, వాయు కాలుష్యం, వంశపారంపర్యమైన అంశాలు కూడా ఆస్తమా రావడానికి కారణమని భావిస్తుంటారు. దుమ్ము, ధూళి, జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, పువ్వులలోని పుప్పొడి రేణువులు, గడ్డి పోచలు, బూజు వంటివి అలర్జీకి కారణమవుతాయి. అది ఆస్తమాకు దారి తీస్తుంది. జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఆస్తమా వచ్చే అవకాశాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. ప్రతి రోజూ కొన్ని ఆసనాలు చేస్తుంటే ఆస్తమా నుంచి దూరం చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. సేతుబంధాసనం, పవన్ముక్తాసనం, భుజంగాసనం వంటి అసనాలు చేయడం వల్ల ఆస్తమా నుంచి గట్టెక్కవచ్చని సూచిస్తున్నారు.

ఆస్తమా ఉన్నవారు తీసుకునే జాగ్రత్తలు:

ఆస్తమా ఎప్పటికీ నయం కాదు కానీ.. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే దాని ప్రభావం తగ్గుతుందంటున్నారు. ప్రాణాలను కాపాడుకోవచ్చు. అస్తమా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ తాగకూడదు. కనీసం పొగ పరిసర ప్రాంతాల్లో ఉండకపోవడం మంచిది. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకే వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఆస్తమా ఉన్నవారు వైద్యుల సూచన మేరకు ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా బరువును నియంత్రణలో పెట్టుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తల్లిదండ్రులకు ఆస్తమా ఉన్నట్లైయితే.. వారి పిల్లలకు చిన్నప్పటి నుంచి ఫిజికల్‌ యాక్టివిటీ పెంచాలి. ఆస్తమా సమస్య ఉన్నవారు.. ఊపిరితిత్తుల వ్యాయామాల్ని క్రమం తప్పకుండా చేయాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source:

ఇవి కూడా చదవండి

Health Tips: మీ అరచేతులు, అరికాళ్లు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? హైపర్‌ హైడ్రోసిస్‌ కావచ్చు.. జాగ్రత్త..!

Spices To Avoid In Summer: వేసవిలో ఈ 4 మసాలాలు తినడం ప్రమాదమే..! అవేంటో తెలుసుకోండి