Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ నేపాల్ పర్యటనపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..

రాహుల్ మరోసారి రాజకీయ చిక్కుల్లో పడ్డారా..? బలమైన అస్త్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి బీజేపీకి అందించారా..? రాహుల్ ఎప్పుడు విదేశాల్లోకి వెళ్లినా ఏదో వివాదం..! గతంలో లండన్ పర్యటన చేయడం.. ఆ తర్వాత పాకిస్తాన్..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ నేపాల్ పర్యటనపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
Rahul With Nima Martin Sher
Follow us

|

Updated on: May 04, 2022 | 2:49 PM

రాహుల్ మరోసారి రాజకీయ చిక్కుల్లో పడ్డారా..? బలమైన అస్త్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి బీజేపీకి అందించారా..? రాహుల్ ఎప్పుడు విదేశాల్లోకి వెళ్లినా ఏదో వివాదం..! గతంలో లండన్ పర్యటన చేయడం.. ఆ తర్వాత పాకిస్తాన్ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం.. ఇలా చాలా వివాదాలు రాహుల్ చుట్టుకోవడం కామన్. అయితే ఈ సారి 12 సెకన్ల ఒకే ఒక్క వీడియో ఇప్పుడు ఢిల్లీ టు గల్లీ రాజకీయ సునామీలా చుట్టేస్తోంది. బీజేపీకి జాతీయ స్థాయిలో రాహుల్‌ పార్టీ క్లిప్స్ పొలిటకల్‌ అస్త్రంగా మారడంతో పార్టీని వివరణ ఇచ్చుకునే పనిలో పడింది. కాంగ్రెస్‌ నాయకుడు నైట్‌ పార్టీల్లో బిజీగా ఉన్నారంటూ ఆ వీడియోను బీజేపీ వైరల్‌ చేస్తోంది. వివాహానికి వెళ్లిన రాహుల్‌.. పబ్‌లో ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న.. ఓ జాతీయ పార్టీ సీనియర్ నాయకుడు ఇలా ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ ఐటీ వింగ్‌ రాహుల్‌ తీరుని నెట్టింట్లో ఎండగడుతూ ట్వీట్లతో రచ్చ చేస్తోంది. బీజేపీ యువమోర్చా నేత పీఎం సాయి ప్రసాద్ ఈ ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఆమె పేరు హౌ యాంక్వీ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా ఆమె పనిచేస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి చర్చకు వచ్చాయని అభిప్రాయపడ్డారు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా ఆమె గతంలో నేపాల్‌లో చేసిన రాజకీయ ఎత్తుగడలను గుర్తు చేశారు. అంతేకాక, నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అనవసర విమర్శలు చేసిందనీ, ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేత వివాదంలో చిక్కుకున్నాడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

వివాదాల వీడియోలో రాహుల్‌తో..

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ. నేపాల్‌ టూర్‌లో ఉన్న రాహుల్‌గాంధీ.. ఖాట్మండు నైట్‌ క్లబ్‌లో కనిపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య యూరప్‌తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్‌లో మూడు దేశాల పర్యటనలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ నేపాల్ చేరుకున్నారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇబ్బందుల్లో ఉన్న పార్టీని వదిలి.. విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు కొందరు. నేపాల్‌లోని చైనా అంబాసిడర్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్టు ప్రచారం మొదలైంది. రాహుల్‌ నేపాల్‌లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్‌ ఓ కథనం ప్రచురించింది.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం నేపాల్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను ఖాట్మండులోని నైట్‌క్లబ్‌లో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై బీజేపీ విమర్శల దాడి మొదలు పెట్టింది. ఈ వీడియో నేపాల్‌లోని లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్ నుంచి వచ్చింది. మయన్మార్‌లో నేపాల్‌ రాయబారిగా పనిచేసిన భీమ్‌ ఉదాస్‌.. తన కుమార్తె వివాహానికి రాహుల్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆ వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్‌ నేపాల్‌ వెళ్లినట్టు సమాచారం.

నేపాల్ వివాదం సమయంలోనూ..

నేపాల్-భారత్ మధ్య ‘బేటీ-రోటీ’ బంధం ఉందనే ఓ నానుడి ఉంది. చాలా ఏళ్లుగా రెండు దేశాల మ‌ధ్య మంచి మైత్రి ఉంది. చిన్న దేశ‌మైన నేపాల్ చాలా విష‌యాల్లో భార‌త్‌పై ఆధార‌ప‌డేది. అయితే, ఇప్పుడు క్ర‌మంగా చైనా వైపు మొగ్గుతున్న నేపాల్ త‌ర‌చూ భార‌త్‌ పై నింద‌లు మోపుతోంది. స‌రిహ‌ద్దు పేచీ పెడుతోంది. సరిహద్దుల దగ్గర నుంచి కరోనా వైరస్ వరకు భారత్‌పై నేపాల్ అసత్యమైన విమర్శలు చేస్తోంది. రెండు రోజుల క్రితం భారత భూభాగంలోని లిఫులేఖ్,కాలాపానీ,లింపియాధురాని తమ భూభాగంలోనివిగా చూపెడుతూ వివాదాస్పద మ్యాప్ ను నేపాల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

నేపాల్ వివాదాస్పద మ్యాప్‌ను 2020లో విడుదల చేసింది. ఇందులో భారత భూమిలోని కొన్ని భాగాలు కూడా ఉన్నాయి. నేపాల్ విడుదల చేసిన సవరించిన మ్యాప్‌లో, భారతదేశానికి సరిహద్దుగా ఉన్న లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు క్లెయిమ్ చేయబడ్డాయి. భారత మ్యాప్‌లో ఈ భాగాలన్నీ ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి మరియు భారతదేశం కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. పరిష్కరించింది ఎవరు..? 

నేపాల్ అధికార పార్టీ.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (CPN(మావోయిస్టు))లో చీలికలు వచ్చిన సమయంలో కూడా డ్రాగన్ కంట్రీ చైనా నేరుగా కల్పించుకుంది. రెండుగా విడిపోయిన పార్టీని కలిపేందుకు డ్రగన్ కంట్రీ ఒకరిని రంగంలోకి దింపింది. పెద్ద సమస్యకు సామరస్యంగా ముగింపు పలికింది. అయితే వారి మధ్య జరిగిన వివాదానికి ఎండ్ కార్డ్ వేసిన  చైనా అయినా.. ఆ ప్రతినిధి మాత్రం నేడు రాహుల్‌తో వీడియోలో ఉన్న మహిళే అనేది అంతర్జాతీయ మీడియా కామెంట్. అయితే అందులో ఉన్నది చైనా ప్రతినిధి కాదు.. పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటూ నేపాల్ మీడియా తాజాగా వెల్లడించండి కొసామెరుపు.

అయితే నాడు.. నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ(NCP)అధికారంలో ఉంది. కేపీ శర్మ ఓలి ప్రధానిగా ఉన్నారు. అయితే నేపాల్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులే ప్రధాని ఓలిని రాజీనామా చేయాలంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆ సమయంలో నేపాల్ లో రాజకీయ గందరగోళం తారాస్థాయిలో ఉంది. పార్టీ చైర్మన్, ప్రెసిడెంట్ రెండు పదవులను స్వాధీనం చేసుకోవడానికి ఓలి… UML(Communist Party of Nepal,Unified Marxist–Leninist)), MC(Communist Party of Nepal,Maoist Centre) విలీన ప్రక్రియను మార్చారు. ప్రతిఒక్కరికీ ఒక వ్యక్తికి ఒక పోస్ట్(one man one post) సూత్రాన్ని వర్తింపజేస్తున్నప్పుడు, ఒలి దానిని స్వయంగా అనుసరించడానికి నిరాకరించాడు. దీంతో ఇది ఆ పార్టీలోని మిగిలిన నాయకుల వ్యతిరేకతకు కారణంగా మారింది. అప్పుడు తన ప్రభుత్వాన్ని కాపాడాలంటూ నేపాల్ ప్రధాని ఓలి చైనాతో సంప్రదింపులు జరిపారు. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చింది కూడా ఈ లేడీ డాన్.

దీంతో నేపాల్ లో అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(NCP)నాయకులతో చైనా అంబాసిడర్ హువో యాంకీ వరుస సమావేశాలు నిర్వహించింది. సొంతపార్టీ నుంచి ప్రధానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమస్యను చక్కదిద్దింది.

Activities Of Chinese Ambas

Activities Of Chinese Ambas

రాహుల్ గాంధీతో కనిపించిన మహిళ చైనా దౌత్యవేత్త హౌ యాంకీ అని, 2018 నుండి నేపాల్‌లో చైనా రాయబారిగా పనిచేస్తున్నారని కూడా ఒక వాదన ఉంది.

రాహుల్ విఫలమవుతున్నారా..!

తరతరాలుగా నెహ్రూ-గాంధీ వారసుల చేతుల్లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఘోర పరాజయం చవిచూసింది. రాహుల్ ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ.. అందరూ భారత దేశ ప్రధానులుగా పదవిని చేపట్టినవారే. అయితే, నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడిగా రాజకీయ వేదికపైకి వచ్చిన రాహుల్.. తమ పూర్వీకుల స్థాయిలో కాంగ్రెస్ పార్టీని నడిపించలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ప్రతి పక్షాలకు తోడు రాహుల్ తీరు కూడా అలానే ఉంటోందని అంటున్నారు. రాహుల్ ప్రతి అడుగు బీజేపీకి కలిసి వస్తోందని అంటున్నాారు. ఈ నిర్ణయాలు కేవలం రాజకీయ విశ్లేషకులవి మాత్రమే కాదని.. కాంగ్రెస్ పార్టీ జట్టులో ఉన్నటువంటి వారు.. ఆ పార్టీతో జోడీ కట్టాలని అనుకుంటున్నవారు కూడా ఇలానే స్పందిస్తున్నారని వీరు అభిప్రాయ పడుతున్నారు.

గల్వాన్‌ ఘటనతో..

గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. పైగా అప్పుడప్పుడు చేస్తున్న ప్రకటనల్లో సమన్వయం లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు చైనాలో భారత రాయబారి చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. కాగా, ఇప్పటివరకు రక్షణ, అధికార యంత్రాంగాలలోని ముఖ్యులపైనే హనీట్రాప్ జరిగేది. తాజాగా రాహుల్ గాంధీపై ఈ ఆరోపణలు రావడంతో చైనా మన రాజకీయ నాయకులను అమ్మాయిలను ఎరగా వేసి లోబరుచుకుంటోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, హౌ యాంక్వీని జీ జిన్ పింగ్ ప్రత్యేకంగా హనీట్రాప్ కోసమే వాడుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈమె గతంలో ఎక్కడెక్కడ, ఏమేం చేసిందనే వివరాలను అంతర్జాతీయ విశ్లేషకులు తవ్వి తీస్తున్నారు.

నోట్: స్టోరీలోని ముఖ చిత్రంలో కనిపిస్తున్న యువతి చైనా దౌత్యవేత్త హౌ యాంకీ కాదని తేలింది. 

ఇవి కూడా చదవండి: PM Modi Visit: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ బిజీ బిజీ.. యూరఫ్ తర్వాత నేపాల్, జపాన్‌ సందర్శించే అవకాశం

Forbes List: అగ్రరాజ్యంలో సత్తా చాటిన జగిత్యాల వాసి.. ఏకంగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు..

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..