Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ భయ్యా.. రాజకీయాలు వదిలేయండి.. లైఫ్ ఎంజాయ్ చేయండి.. ట్విట్టర్ లో భిన్నాభిప్రాయాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేపాల్​లో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఓ వీడియో సోషల్ మీడియాలో(Social Media) చక్కర్లు కొడుతోంది. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండగా....

Rahul Gandhi: రాహుల్ భయ్యా.. రాజకీయాలు వదిలేయండి.. లైఫ్ ఎంజాయ్ చేయండి.. ట్విట్టర్ లో భిన్నాభిప్రాయాలు
Rahul Gandhi
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 03, 2022 | 4:40 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేపాల్​లో జరిగిన ఓ వివాహానికి హాజరైన ఓ వీడియో సోషల్ మీడియాలో(Social Media) చక్కర్లు కొడుతోంది. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్ లీడర్లు వారి విమర్శలకు కౌంటర్లు వేస్తున్నారు. నేపాల్ నైట్‌క్లబ్ నుంచి విడుదలైన రాహుల్ గాంధీ వీడియోపై ట్విట్టర్(Twitter) వినియోగదారులు భిన్నంగా స్పందించారు. ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన జీవితం తర్వాత వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉంటారని, ఇలా చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. “రాహుల్ అన్నా.. కాంగ్రెస్, ఎన్నికలు, రాజకీయాలు అన్నీ వదిలేయండి. లైఫ్ ను ఎంజాయ్ చేయండి” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.” రాహుల్ గాంధీ నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించడంతో, అతనిని ఎగతాళి చేస్తున్నారు. దయచేసి అతనిని కంగారు పెట్టకండి!” అని ఒక ట్విట్టర్ వినియోగదారుడు రాశారు. ‘‘పార్టీపై దృష్టి పెట్టాలని రాహుల్ గాంధీకి ప్రపంచం మొత్తం పాఠాలు చెబుతోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికపై కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తున్నారు” మరో వ్యక్తి కామెంట్ చేశారు.

ఈ వీడియోపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ చేస్తూ.. ఇది రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదు. రాహుల్ గాంధీ ఎవరితో ఉన్నారని ప్రశ్నించారు. చైనాలో ఏజెంట్లు ఉన్నారా? సైన్యానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ చైనా ఒత్తిడి వల్లేనా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ప్రశ్నలు రాహుల్ గాంధీది కాదు దేశానికి సంబంధించినదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ, వెకేషన్, పార్టీ, హాలిడే, ప్లెజర్ ట్రిప్, ప్రైవేట్ ఫారిన్ విజిట్ తదితర వీడియోలను షేర్ చేస్తూ విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో జల్సా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

వివాహాలకు హాజరు కావడం సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమేనని, అదేం నేరం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా(Randeep Surjewala) వివరణ ఇచ్చారు. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పొరుగు దేశమైన నేపాల్​కు రాహుల్(Rahul) వెళ్లారని అన్నారు. శుభకార్యాలకు హాజరవడం ఇప్పటివరకైతే నేరమేమీ కాదని.. ఇకపై బీజేపీ ప్రభుత్వం దానిని కూడా చట్టవిరుద్ధంగా మారుస్తుందేమోనని ఎద్దేవా చేశారు. అలా జరిగితే స్నేహితులు, కుటుంబ సభ్యుల వివాహాలకు వెళ్లే సంప్రదాయాన్ని మార్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Ration Card Rules: రేషన్ కార్డులకు కొత్త రూల్స్ ఇవే.. వారు కార్డ్ సరెండర్ చేయకపోతే చర్యలు తప్పవు..

OMG! బయటకు మాత్రమే ఇది ‘పింక్ కలర్ బస్సు’.. లోపల చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయంతే?