Hyderabad Rains: భాగ్యనగరంలో వర్షం బీభత్సం… రహదారి, లోతట్టు ప్రాంతాలు జలమయం..
Hyderabad Rains: భానుడి భగ భగ లకు ఉక్కిరిబిక్కిరి అయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఉపశమనం కల్పిస్తూ భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారు జామున ఒక్కసారిగా భారీ వర్షం బీభత్సం సృష్టించింది..
Hyderabad Rains: భానుడి భగ భగ లకు ఉక్కిరిబిక్కిరి అయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఉపశమనం కల్పిస్తూ భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారు జామున ఒక్కసారిగా భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి యాదాద్రి జిల్లాతో పాటు (Yadadri District) గ్రేటర్ హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుడిన భారీ వర్షం కురవడంతో చాల చోట్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది.
రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం మయ్యాయి. పంజాగుట్ట , అమీర్ పేట , బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ , సికింద్రాబాద్, సైదాబాద్, చంపాపేట్, చిలకల గూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాలఆటో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కుడిన భారీ వర్షం కురుస్తుంది.
వర్షంతో గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవాకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సికింద్రాబాద్ లోని సీతాఫల్మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు.. వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1 సెంటీమీటర్.. అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు.. ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు.. గోషామహల్ బాలానగర్ లో 5.4 సెంటీమీటర్లు.. ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్.. బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9 సెంటీమీటర్లు..మల్కాజ్గిరిలో 4.7 సెంటీమీటర్లు..సరూర్నగర్ ఫలక్నామా లో 4.6 సెంటి మీటర్లు..గన్ ఫౌండ్రీ లో 4.4 సెంటీమీటర్లు..కాచిగూడ , సికింద్రాబాద్ లో 4.3 సెంటీమీటర్లు..చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు..గుడిమల్కాపూర్ నాచారం లో 4.1 సెంటి మీటర్..అంబర్పేట్ లో 4 సెంటీమీటర్లు..అమీర్పేట్ సంతోష్ నగర్ లో 3.7 సెంటీమీటర్లు.. ఖైరతాబాద్లో 3.6 సెంటీమీటర్లు..బేగంబజార్ ,హయత్ నగర్ చిలకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
Also Read: Smart Phone: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారాా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..